రోజూ ఈ నీటిని ఒక గ్లాస్ తాగితే..బీపీ, షుగర్ కంట్రోల్, కిడ్నీలు ఆరోగ్యంగా..!!
అనేక ఆరోగ్య సవాళ్లకు పరిష్కారం బార్లీ నీళ్లు. ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు అందుకోవచ్చు. బార్లీ గింజల్లో అనేక పోషకాలు, ఔషధ విలువలు ఉంటాయి. ఇవి పలు వ్యాధులను నయం చేస్తాయి. గుప్పెడు బార్లీ గింజలను తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే అందులో కాస్త తేనె, నిమ్మరసం కలిపి తాగేయాలి. ఇలా చేస్తుంటే అనేక లాభాలను పొందవచ్చు. బార్లీ గింజల్లో బీటా గ్లూకాన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
బార్లీ నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. బార్లీ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. దీంతో అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. అతిగా ఆహారం తింటున్ నవారు బార్లీ నీళ్లను రోజూ తాగుతుంటే ఫలితం ఉంటుంది. బార్లీ గింజల్లో ఉండే బీటా గ్లూకాన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. బార్లీ నీటిలో అద్భుతమైన డిటాక్సిఫయింగ్ గుణాలు ఉంటాయి. కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. కిడ్నీల పనితీరు మెరుగు పడుతుందని చెబుతున్నారు.

నిపుణుల సూచనలు
వినియోగంలోనూ కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు. బార్లీ గింజల్లో అనేక రకాల బి విటమిన్లతో పాటు ఐరన్, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతోపాటు మెటబాలిజం మెరుగు పడేలా చేస్తాయి. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బార్లీ నీళ్లు సహజసిద్ధమైన రిఫ్రెషింగ్ డ్రింక్‌లా కూడా పనిచేస్తాయి. దీని ద్వారా శరీరం కోల్పోయిన ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి పొందుతుంది. బార్లీ గింజలను మరిగించే ముందు నీటితో శుభ్రంగా కడగాలి. అర కప్పు గింజలకు 4 లేదా 5 కప్పుల నీళ్లను పోయాలి. స్టవ్‌ను సిమ్‌లో ఉంచి 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించాలి. దీంతో నీళ్లు రెడీ అవుతాయి. ఈ నీళ్లను వడకట్టిన తరువాత గోరు వెచ్చగా ఉండగానే రుచి కోసం తేనె, నిమ్మరసం కలిపి తాగటం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications