IPL 2026 Final: అంపైర్ చెత్త నిర్ణయం.. షాక్‌లో కోహ్లీ, అనుష్క శర్మ!(వీడియో)
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వివాదాస్పద నిర్ణయంతో మరింత ఉత్కంఠగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన ఈ టైటిల్ పోరులో, ఒక అంపైరింగ్ నిర్ణయం మైదానం నుంచి సోషల్ మీడియా వరకు తీవ్ర చర్చకు దారితీసింది. గుజరాత్ ఇన్నింగ్స్ పదవ ఓవర్‌లోని చివరి బంతికి, ఆర్సీ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జోర్డాన్ కాక్స్ బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అయితే, థర్డ్ అంపైర్ ఇచ్చిన తీర్పు RCB సంబరాలను క్షణాల్లో వివాదంలోకి నెట్టింది.
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫ్ఫీ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఫైన్ లెగ్ దిశగా వేగంగా కొట్టాడు. అక్కడ ఫీల్డర్ గా ఉన్న జోర్డాన్ కాక్స్ ముందుకి డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసి సుందర్ నిరాశగా డగౌట్ వైపు తిరిగి వెళ్లడం ప్రారంభించాడు.అయితే, మైదానంలోని అంపైర్లు క్యాచ్‌ను నిర్ధారించుకోవడానికి థర్డ్ అంపైర్‌కు సూచించారు. టెలివిజన్ రీప్లేలలో వివిధ కోణాల నుంచి ఫుటేజ్ పరిశీలించగా.. థర్డ్ అంపైర్ బంతి నేలను తాకిందనే నిర్ధారణకు వచ్చారు. పెద్ద స్క్రీన్‌పై 'నాట్ ఔట్' అని ఫ్లాష్ అవ్వగానే మైదానంలో తీవ్ర నిశ్శబ్దం ఆవరించింది.

ఈ నిర్ణయం చూసి ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బిగ్ స్క్రీన్‌ను చూసి పూర్తిగా నిశ్చేష్టుడయ్యాడు. అతని ముఖంలో నమ్మలేని ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. స్టాండ్స్‌లో కూర్చున్న కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా ఈ తీర్పును చూసి షాక్‌కు గురైంది. విఐపి స్టాండ్స్‌లో మ్యాచ్ చూస్తున్న అనుష్క శర్మ కూడా ఈ నిర్ణయంతో షాక్‌కు గురై తలపట్టుకుంది. ఆ క్యాచ్ క్లీన్‌గా ఉన్నప్పటికీ నాట్ అవుట్ ఎలా ఇచ్చారనే గందరగోళం ఆమె ముఖంలో కనిపించింది.
Gone... gone... DROPPED! 😱🤯
— Star Sports (@StarSportsIndia) May 31, 2026
Big moment in the match as #WashingtonSundar is dropped in the deep by #JordanCox. 👀#TATAIPL 2026 FINAL | #RCBvGT | LIVE NOW 👉 https://t.co/nTKb3Qmpst pic.twitter.com/xUznFU4TBU
ఈ అంపైర్ తీర్పు సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపింది. అభిమానులు ఈ క్యాచ్‌ను ఈ సీజన్‌లో జరిగిన ఒక లీగ్ మ్యాచ్‌లోని జేసన్ హోల్డర్ (GT) పట్టిన క్యాచ్‌తో పోలుస్తున్నారు. హోల్డర్ క్యాచ్‌ను సరైనదిగా పరిగణించినప్పుడు, కాక్స్ క్యాచ్‌ను నాట్ ఔట్‌గా ఎందుకు ప్రకటించారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications