Viral Video: నోట్ల వర్షం కురిపించిన కోతి.. ఎగబడి ఏరుకున్న జనం

ఉత్తరప్రదేశ్‌ లోని బులంద్‌ షహర్‌ జిల్లా కోర్టు సముదాయం వద్ద ఓ కోతి కలకలం సృష్టించింది. ఓ బ్యాగ్‌ ను లాక్కెళ్లి చెట్టుపై కూర్చొంది. అంతేకాక బ్యాగులోని రూ. 2 లక్షల రూపాయల నోట్లను కిందకు వెదజల్లింది. నోట్లను ఏరుకునేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భూ లావాదేవీ పనులకై ఓ న్యాయవాది కార్యాలయానికి వచ్చాడు. అయితే అతని వద్ద ఉన్న బ్యాగులో రూ. 2 లక్షల వరకు డబ్బు ఉంది. అనుకోకుండా ఓ కోతి అతని చేతిలోని బ్యాగ్‌ ను లాక్కొని పారిపోయింది. బ్యాగ్‌ ను లాక్కొని చెట్టుపైకి ఎక్కిన కోతి.. ఆహారం కోసం సంచిని వెతికింది. కానీ అందులో ఆహారానికి బదులుగా రూ.500 నోట్ల కట్టలు దొరికాయి.

Monkey Creates Chaos at Bulandshahr District Court in Uttar Pradesh by Raining Down Currency Notes

దాంతో కోతి వాటిని చించి చెట్టు పైనుండి కిందకు విసిరింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా చెట్టు వద్దకు పరుగులు తీశారు. డబ్బును ఏరుకునేందుకు ఎగబడ్డారు. అయితే స్థానిక ప్రజల సహాయంతో బ్యాగ్ యజమాని తన రెండు లక్షలలో దాదాపు రూ. 1.98 లక్షల నగదును తిరిగి పొందగలిగాడు. దాంతో ఆ బ్యాగ్ యజమాని ఊపిరి పీల్చుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+