మీ అన్నయ్య పార్టీని అడుగు, జగన్ బతికించారు, ఇన్నాళ్లేం చేశావ్: పవన్ డైలాగ్‌తో రోజా

Posted By:
Subscribe to Oneindia Telugu
  ఉద్యమం చేస్తానని..పవన్ నాలుగేళ్లుగా మౌనం

  అమరావతి: ఈ రోజు ప్రత్యేక హోదా అనే అంశం బతికి ఉందంటే అందుకు కారణం తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమె సోమవారం పార్టీ ఆవిర్భావ వేడుక సందర్భంగా మాట్లాడారు.

  చదవండి: బాబు వల్లే కియా వచ్చిందని గొప్పలు, భయపడ్డారు: మాణిక్యాల రావు తీవ్రవ్యాఖ్యలు

  ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆమె మండిపడ్డారు. ఓటుకు నోటు కోసం చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. జగన్ మాత్రం నాలుగేళ్లుగా దానికి ప్రాణం పోశారని, ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హోదా కావాలని అంటున్నారని చెప్పారు.

  చదవండి: రైల్వే జోన్ ఇవ్వలేం, ఏపీకి మరో షాక్: చేతలెత్తేసిన కేంద్రం, పుండు మీద కారం

  హోదా కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా

  హోదా కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా

  చంద్రబాబు, పవన్‌లు కూడా ప్రత్యేక హోదా అంటున్నారంటే అది వైయస్ జగన్, వైసీపీ విజయమని రోజా అన్నారు. రాష్ట్రంలో సమైక్యాంధ్ర కోసం, హోదా కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది జగన్ అన్నారు.

  దమ్మున్న నేత కలిగిన మనసున్న పార్టీ

  దమ్మున్న నేత కలిగిన మనసున్న పార్టీ

  అందుకే, దమ్మున్న నాయకుడు కలిగిన మనసున్న పార్టీ వైసీపీ అని చెబుతుంటామని రోజా అన్నారు. ఈ సందర్భంగా ఆమె పవన్ కళ్యాణ్ - వెంకటేష్ గోపాల గోపాల సినిమాలోని డైలాగ్‌ను కొట్టారు. రావడం కొంచెం లేటవచ్చేమో గానీ రావడం పక్కా అన్నట్లుగా 2014లో కొద్దిలో అధికారం కోల్పోయినా, 2019లో గెలుస్తామన్నారు.

  బాబు యూటర్న్, రూ.500 నోటులా అన్నారు

  బాబు యూటర్న్, రూ.500 నోటులా అన్నారు

  ప్రజల కోసం పుట్టిన పార్టీ వైసీపీ అని రోజా చెప్పారు. హోదాను బాబు తాకట్టు పెడితే జగన్ బతికించారన్నారు. హోదా రూ.500 నోటులా చెల్లని వంటిదని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు అలాంటి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజల్లో నమ్మకం తెచ్చిన వ్యక్తి జగన్ అన్నారు.

  ప్యాకేజీ క్యాబేజీ

  ప్యాకేజీ క్యాబేజీ

  ప్రత్యేక ప్యాకేజీ పనికి రానీ ప్యాకేజీ అని, అది ప్రజల చెవిలో క్యాబేజీ అని తాము మొదటి నుంచి చెబుతున్నామని రోజా అన్నారు. మోడీని, జైట్లీని అసెంబ్లీలో పొగుడుతూ తీర్మానం చేసింది చంద్రబాబు అన్నారు. హోదా కావాలని ఇప్పుడు చంద్రబాబు, పవన్ అంటున్నారంటే అది జగన్ విజయమన్నారు. హోదా కోసం విద్యార్థులు ఉద్యమిస్తే పీడీ యాక్టు పెట్టారని మండిపడ్డారు.

  పవన్ కళ్యాణ్ నాలుగేళ్లు ఏం చేశారు

  పవన్ కళ్యాణ్ నాలుగేళ్లు ఏం చేశారు

  ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తానని ఎప్పుడో చెప్పిన పవన్ నాలుగేళ్లుగా మౌనంగా ఉండి, ఇప్పుడు జాయింట్ ఫ్యాక్ఠ్ ఫైండింగ్ కమిటీ అని, ఇంకో కమిటీ అని నాటకాలు ఆడుతున్నారని రోజా మండిపడ్డారు. చిరంజీవే పార్టీ నడిపించలేకపోయారన్నారు. జగన్ వల్లే చంద్రబాబు, పవన్ యూ టర్న్ తీసుకున్నారని చెప్పారు.

  పవన్ టీడీపీ, బీజేపీ, చిరంజీవి కాంగ్రెస్‌లను అడగాలి

  పవన్ టీడీపీ, బీజేపీ, చిరంజీవి కాంగ్రెస్‌లను అడగాలి

  రాష్ట్ర అభివృద్ధిపై ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేసి ముందుకు రావాలని రోజా అన్నారు. జగన్ కేంద్రంతో ఢీకొడుతున్నారని చెప్పారు. అవిశ్వాసం విషయంలో పవన్ పక్క రాష్ట్రాలకు వెళ్లి ఎంపీలను అడగడం కాదని, మన రాష్ట్రంలోని ఎంపీలను అడగాలన్నారు. పవన్ మొదట బీజేపీ, టీడీపీలను రాజీనామాపై ఒప్పించాలని, తన సోదరుడు చిరంజీవి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మేం దేనికైనా సిద్ధమని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSRCP MLA Roja says Jana Sena chief Pawan Kalyan takes U turn on Special Status.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి