‘అదే నా రాస్తా’, ఒక్క పోస్టుతో తేల్చేసిన పవన్..!!

జనసేనాని పవన్ తెలంగాణలో తన భవిష్యత్ పాత్ర పై తేల్చేసారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. పవన్ పార్టీ సభకు అనుమతి నిరాకరణ.. పవన్ పైన తెలంగాణ నేతల విమర్శల నేపథ్యంలో జనసేనాని స్పష్టత ఇచ్చారు. ఆ తరువాత వరుసగా సోషల్ మీడియా వేదిక గా చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. వీటి ద్వారా పవన్ తన వైఖరి.. భవిష్యత్ పైన తేల్చి చెబుతున్నారు. ఈ పోస్టులు వైరల్ గా మారాయి.

పవన్ కల్యాణ్ తెలంగాణ పైన గట్టిగానే ఫోకస్ చేసారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ హైదరాబాద్‌లో నవ నిర్మాణ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సభలో పవన్ కల్యాణ్ పాల్గొని హాజరుకావాల్సి ఉంది. కాగా, ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో.. తాజా పరిణామాల పైన స్పందించిన పవన్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. తన పై విమర్శలు చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల విమర్శలకు బదులిచ్చారు. జనసేన ప్రయాణం తెలంగాణలోనే మొదలైందని అన్నారు. కానీ, కొంతమంది నాయకులు హైదరాబాద్లో ఎలా అడుగు పెడతావ్..? నీకు ఇక్కడేం పని అని మాట్లాడుతున్నారు.. నన్ను బెదిరించడానికి తెలంగాణ ఏమైనా మీ అయ్య జారీరా? ఇక్కడ కొంతమంది నాయకులు జనాన్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

షర్మిల కు రాజ్యసభ సీటు ఖరారు వేళ బిగ్ ట్విస్ట్, ఆయన ఎంట్రీతో..!!
షర్మిల కు రాజ్యసభ సీటు ఖరారు వేళ బిగ్ ట్విస్ట్, ఆయన ఎంట్రీతో..!!
janasena-chief-pawan-kalyan-sensational-tweet-after-pressmeet-in-hyderabad-goes-viral

తెలంగాణలో రాజకీయంగా పవన్ ఫోకస్

https://twitter.com/PawanKalyan/status/2061990254710853915

ధైర్యంగా నిలబడతాం. భయం అనేది లేదని పవన్ అన్నారు. ఇదే సమయంలో పవన్ కీలక ప్రకటన చేశారు. ఇన్నాళ్లూ తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని తాను అనుకోలేదు.. కానీ, ఇప్పుడు చెబుతున్నా.. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటోంది.. రాజకీయ క్షేత్రంలో నిలబడి తీరుతామని స్పష్టం చేశారు. అంతేకాదు.. అవసరం అయితే, తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, తాను పాల్గొంటానని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కాకరేపిన పవన్.. తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. ప్రముఖ కవి శేషేంద్ర రచించిన కవితను పవన్ కల్యాణ్ పోస్టు చేశారు. 'అదే నా రాస్తా'.. అంటూ పవన్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో.. రానున్న రోజుల్లో పవన్ తెలంగాణ కేంద్రంగా రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణతో తనకు ఉన్న అనుబంధం గురించి పవన్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+