12 బిలియన్ డాలర్ల బంగారం అమ్మేసిన RBI ? తేల్చేసిన కేంద్రం..!

పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంతో దేశ ఆర్ధిక వ్యవస్థ ఇబ్బందులు పడుతోంది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తరిగిపోతున్నాయి. దీంతో రూపాయి విలువ పతనం కూడా అవుతోంది. ఈ నేపథ్యంలో పరిస్ధితిని చక్కదిద్దేందుకు ఆర్బేఐ 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని అమ్మేసినట్లు (RBI Gold Sale) బ్లూంబర్గ్ వెలువరించిన కథనం ఒక్కసారిగా కలకలం రేపింది. బంగారం అమ్ముకోవాల్సిన పరిస్ధితులు ఎప్పుడో 90వ దశకంలో దేశంలో ఉండేవి. మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్ధితి వచ్చిందా అన్న ఆందోళన సర్వత్రా మొదలైంది.

దీనిపై కేంద్రం ఇవాళ స్పష్టత ఇచ్చింది. విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బంగారాన్ని విక్రయించిందని పేర్కొన్న మీడియా నివేదికను కేంద్రం ఖండించింది. ఆర్బీఐ సుమారు 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించి ఉండవచ్చని, విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొన్న నేపథ్యంలో కేంద్రం ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ వివరణ ఇచ్చింది.

RBI Gold Sale Row Centre Rejects Bloomberg s 12 Billion Claim Issues Official Clarification

బంగారం అమ్మకాల ప్రచారాన్ని తిప్పుకొడుతూ.. దేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా వాస్తవానికి "సెప్టెంబర్ 2025 చివరి నాటికి 13.92 శాతం నుండి మార్చి 31, 2026 నాటికి 16.70 శాతానికి, మే 22, 2026 నాటికి మరింతగా 16.85 శాతానికి" పెరిగిందని కేంద్రం స్పష్టం చేసింది.బంగారం యొక్క భౌతిక నిల్వలను ఆర్బీఐ తన నెలవారీ బులెటిన్‌లో కూడా వెల్లడిస్తుంది. ప్రామాణికమైన సమాచారం కోసం ఎల్లప్పుడూ ఆర్‌బిఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి అంటూ కేంద్రం తన వివరణలో పేర్కొంది. దీంతో ప్రస్తుతానికి బంగారం అమ్మకాల ప్రచారానికి చెక్ పడినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+