Irumudi Glimpse: గుండెల్ని పిండేస్తున్న ‘ఇరుముడి’ గ్లింప్స్!
Irumudi Glimpse: మాస్ మహారాజా తన రెగ్యులర్ మాస్ యాక్షన్ ఫార్మాట్‌కు కాస్త విరామం ఇచ్చి పూర్తి ఎమోషనల్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కమర్షియల్ హంగులతో కూడిన ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ఇరుముడి' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన ఓ ప్రత్యేక గ్లింప్స్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది.
ఈ గ్లింప్స్ ఓ బాధ్యతాయుతమైన తండ్రి, అతని కూతురి చుట్టూ సాగుతుంది. తన ప్రాణంగా చూసుకునే కూతురి కోసం ఆ తండ్రి ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ఆమె కోసం గొడవలకు వెళ్తాడు, తనకున్న తాగుడు అలవాటును కూడా మానేసి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకుంటాడు. ఈ గ్లింప్స్ అన్నింటికంటే ఎమోషనల్ ఎలిమెంట్ ఏంటంటే.. తన కూతురితో కలిసి ఆ తండ్రి అయ్యప్ప దీక్షను స్వీకరిస్తాడు. ఆ తర్వాత పవిత్రమైన ఇరుముడిని మోయడంలో కూతురికి తండ్రి సహాయం చేసే దృశ్యం వారిద్దరి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధాన్ని కళ్లకు కట్టింది.

ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని విధంగా అత్యంత సహజమైన నటనను కనబరిచాడు. స్టార్ హీరో ఇమేజ్‌ను పక్కనపెట్టి ఓ సాధారణ మధ్యతరగతి తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతంగా ఉంది. రవితేజ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఈ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లగా.. కూతురి పాత్రలో నటించిన బేబీ నక్షత్ర తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంది. మానవీయ సంబంధాలను, భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించడంలో తాను దిట్ట అని దర్శకుడు శివ నిర్వాణ మరోసారి నిరూపించుకున్నాడు.
Ravi Teja’s #Irumudi Glimpse Out Now and it looks promising…
— Cinephly (@saichndra) June 3, 2026
I’ve been waiting to see him in an emotional role like Shambo Shiva Shambo…. Hope he scores with this one.#RaviTeja #TheHeartOfIrumudi #IrumudiGlimpse pic.twitter.com/BoizE7GJBP
ఇక ఈ సినిమా సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. విష్ణు శర్మ అందించిన సినిమాటోగ్రఫీ కథలోని ఎమోషన్‌ను చాలా అందంగా ప్రెజెంట్ చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి భావోద్వేగ సన్నివేశాన్ని మరింత రక్తికట్టించింది. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మించినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. కేవలం ఒక సినిమా ప్రమోషనల్ టీజర్‌లా కాకుండా.. 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి' పేరుతో వచ్చిన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. రవితేజ కెరీర్ లోనే ఇదొక బెస్ట్ ఎమోషనల్ ఫిల్మ్‌గా నిలిచిపోనుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications