గుడివాడలో కొడాలి నాని వారసుడి ఎంట్రీ, పోటీ పై కీలక ప్రకటన...!!
గుడివాడ రాజకీయాల్లో కీలక మలుపు. మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ వారసుడొచ్చేసారు. గత కొంత కాలంగా కొడాలి నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం పైన అనేక రకాల చర్చలు సాగాయి. తాజాగా మాజీ సీఎం జగన్ ను కొడాలి నాని కలిసిన సమయంలోనూ ఇదే అంశం పైన ప్రస్తావనకు వచ్చింది. అయితే, నాని ప్రతిపాదనకు అంగీకరిస్తూనే.. కీలక సూచన చేసారు. ఇందుకు కొడాలి నాని సైతం అంగీకరించారు. దీంతో.. ఇప్పుడు గుడివాడలో కొత్త తరం రాజకీయం మొదలు కానుంది.
వైసీపీ నేత.. మాజీ మంత్రి కొడాలి నాని వారసుడి ఎంట్రీకి రంగం సిద్దమైంది. వైసీపీ లో మంత్రిగా పని చేసిన కొడాలి నాని 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత అనారోగ్య కారణాలతో చాలా రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలు.. జగన్ ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరవుతున్నారు. కొద్ది రోజులుగా తిరిగి టీడీపీ లక్ష్యంగా విమర్శలు మొదలు పెట్టారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని పోటీ చేయరని.. ఆయన పార్టీ వ్యవహారా లకే పరిమితం అవుతారే చర్చ కొనసాగింది. అయితే, తాజాగా గుడివాడలో సర్‌పై నిర్వహించిన సదస్సుకు కొడాలి నాని అన్న కుమారుడు అర్జున్ వచ్చారు. వేదిక పైనే పార్టీ నేతలతో కలిసి కూర్చోవటం ఆసక్తి కరంగా మారింది. 2024 ఎన్నికల సమయంలో కూడా కొడాలి నాని సోదరుడి కుమారుడు అర్జున్ తన రాజకీయ వారసుడని ప్రకటించారు.

2029 ఎన్నికల్లో కొడాలి నాని పోటీ..!
2024 తనకు చివరి ఎన్నికలుగా నాని చెప్పుకొచ్చారు. తన ఇద్దరు కుమార్తెలకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదన్నారు. తన తమ్ముడి కుమారుడు రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. ఇప్పుడు ఈ సభలో కొడాలి నాని వారసుడిగా అర్జున్ వస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అయితే, తాజాగా జగన్ ను కలిసిన సమయంలో కొడాలి నాని వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి చర్చ చేసారు. తాను పార్టీ కోసం పని చేస్తానని.. అర్జున్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, జగన్ ఈ సారి ఎన్నికలు కీలకం కావటంతో.. నాని బరిలో నిలవాలని.. అర్జున్ కు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. 2034 ఎన్నికల్లో అర్జున్ కు అవకాశం ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. 2029 ఎన్నికల్లో కొడాలి నాని బరిలో ఉండటం ఖాయమైంది. నానికి తోడుగా గుడివాడలో రాజకీయంగా అర్జున్ ఉండనున్నారు. దీంతో.. ఇప్పుడు గుడివాడ రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications