ప్రేమకు విలువ ఇవ్వనివారు ఎవరితో ఉన్నా ఒకటే: సమంత!

"ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే దాని గురించి నేను బాధపడను.. ప్రేమ విలువ తెలియని వారికి ఎంతమందితో సంబంధం ఉన్నా వారికి కన్నీళ్లే మిగులుతాయి.. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి.. తన ప్రవర్తన మార్చుకుని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అందరికి మేలు జరుగుతుంది." స్టార్ కథానాయిక సమంత ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొన్ని న్యూస్ పోర్టల్స్ వార్తలు రాశాయి. అయితే సమంత వీటిని ఖండించింది. తాను ఎప్పుడూ ఇలా చెప్పలేదని, అదంతా పుకార్లేనని కొట్టిపారేసింది. ఈ వార్తను రాసిన పోర్టల్స్ లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ ను ట్వీట్ చేశారు.

సమంత వ్యాఖ్యానించింది నాగచైతన్య గురించేనని వార్తలు వచ్చాయి. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల.. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమంత వ్యాఖ్యానించింది నాగచైతన్యను ఉద్దేశించే అంటూ పుకార్లు రావడంతో వాటిని ఆమె ఖండించారు. గతేడాది కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాల్గొన్న సమంత తనకు, నాగచైతన్యకు మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా లేవని చెప్పింది. నాగచైతన్యను, తనను కలిపి ఒక గదిలో ఉంచితే పదునైన వస్తువులను కూడా ఉంచాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.

 samantha

నాగచైతన్య-సమంత పరస్పర అంగీకారంతో 2021లో విడిపోయారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సమంత ఖుషీ చిత్రం చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. నాగచైతన్య తెలుగు, తమిళ భాషల్లో కస్టడీ సినిమాను చేస్తున్నారు. వెంకటప్రభు దర్శకత్వం వహిస్తుండగా, కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. ప్రతినాయకుడిగా అరవింద్ స్వామి నటించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ అన్నివర్గాలను ఆకట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+