ఆదాల..వంగా గీత వైసిపి లో చేరిక : ఆ ఇద్దరూ అక్కడి నుండే పోటీ : నెల్లూరు టిడిపి లో కలకలం..!
వైసిపి లో చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటం..ఎన్నికల సమయం దగ్గర పడుతుండటం తో అభ్యర్దుల కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇదే సమయంలో సీనియర్ రాజకీయ నేతలైన ఆదాల ప్రభాకర్ రెడ్డి, వం గా గీత వైసిపి లో చేరారు. వారి పోటీ ఓ స్పష్టత ఇచ్చారు. తాము ఎక్కడ పోటీ చేయాలనేది జగన్ నిర్ణయమని చెప్పారు..
టిక్కెట్ ఇచ్చినా..టిడిపికి జలక్..
నెల్లూరు జిల్లా కు చెందిన సీనియర్ పొలిటిషియన్ ఆదాల ప్రభాకర రెడ్డి వైసిసి లో చేరారు. ఆయన టిడిపి..కాంగ్రెస్.. టిడిపి లో పని చేసారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుండి టిడిపి లో చేరారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేసి వైసిపి అభ్య ర్ది మేకపాటి రాజమోహన రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక, తాజా ఎన్నికల సమయంలో ఆయన తొలుత టిడిపి నుండి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన పార్టీ మారే అవకాశం ఉందని తెలిసి నెల్లూరు జిల్లాలో తొలి సీటుగా ఆదాలకు నెల్లూరు రూరల్ సీటు ప్రకటించారు.

ఇదే సమయంలో ప్రభుత్వం నుండి రావాల్సిన బిల్లుల పై నా ఆదాల ఒత్తిడి చేసారు. 43 కోట్ల మేర బిల్లులు విడుదల అయ్యాయి. ఆ వెంటనే ఆయన టిడిపిని వీడారు. తన ఇంటి మీద నిన్నటి వరకు టిడిపి జెండా ఉండగా..ఈ రోజు ఉదయానికి వైసిపి జెండా ఎగరేసారు. జగన్ సమక్షంలో వైసిపి లో చేరారు. ఆయన నెల్లూరు లోక్‌సభ లేదా కొవ్వూరు అసెంబ్లీ నుండి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆదాల ఇచ్చిన షాక్ నుండి టిడిపి ఇంకా కోలుకోలేదు. జిల్లా పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
వైసిపి లోకి వంగా గీత..
తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్ నేత..కాపు వర్గానికి చెందిన వంగా గీత వైసిపి లో చేరారు. రాజ్యసభ సభ్యురాలిగా టిడిపిలో పని చేసారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ నియోజకవర్గంలో మం చి పట్టు ఉన్న గీత 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. జగన్ పార్టీ కండువా కప్పి గీతను పార్టీలోకి ఆహ్వానించారు . జిల్లా రాజకీయాల పై పూర్తి పట్టు ఉన్న గీత..తిరిగి ఈ సారి వైసిపి నుండి ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించారు. అయితే, ఎక్కడి నుండి పోటీ చేయాలనేది జగన్ నిర్ణయిస్తారని చెప్పారు. గీత ను పిఠాపురం లేదా కాకినాడ లోక్‌సభ నుండి బరిలోకి దింపే ప్రతిపాదన పై జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

గీతకు పిఠాపురం కేటాయిస్తే.. 2014 లో అక్కడి నుండి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాకినాడ లోక్‌సభ బరిలో దించే అవకాశం ఉంది. ఒక వేళ..గీతను కాకినాడ ఎంపీగా బరిలోకి దించితే..పిఠాపురం నుండి దొరబాబు మరోసారి వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో వైసిపి నుండి కాకినాడ లోక్‌సభ అభ్యర్దిగా పోటీ చేసిన సునీల్ టిడిపి నుండి ఈ సారి కాకినాడ లోక్‌సభ అభ్యర్దిగా బరిలో ఉన్నారు. దీంతో..కాకినాడ లోక్‌సభ పై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications