కెసిఆర్ పెద్ద నియంత: అద్దంకి, వక్ఫ్ భూములపై విహెచ్
హైదరాబాద్: వక్ఫ్ భూముల అక్రమాల వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వేసిన సిబిసిఐడి విచారణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలిందని ఆయన అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
రూ. 50వేల కోట్ల విలువైన వక్ఫ్ భూములు అన్యాక్రామంతమయ్యాయని తెలిపారు. ఆ భూములను వెనక్కి తీసుకుని నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ప్రభుత్వానికి ఎంపి హనుమంతరావు సూచించారు.

కెసిఆర్ పెద్ద నియంత: అద్దంకి దయాకర్
ఔరంగజేబు కంటే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పెద్ద నియంత అని తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం కాంగ్రెస్ వేసిన భిక్షేనని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ కోసం చేసిన త్యాగాల వల్లే ఈ రోజు వారు పదవులు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు.
కెసిఆర్‌కు ప్రజలంటే లెక్కలేదని.. ఒకే రోజు సమగ్ర సర్వే పేరుతో నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆ రోజు అందుబాటులో లేకుంటే లెక్కలో లేనట్లేనా? ఇది ఫాసిస్టు విధానం కాదా అని ప్రశ్నించారు. కనీసం 2,3 రోజుల సమయం కూడా ఇవ్వారా అని అడిగారు. తెలంగాణలో ఇంతకుముందు విధానాలు, నిబంధనలు లేనట్లుగా కెసిఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications