బంగారం ధరల్లో హ్యూజ్ క్రాష్: నష్టాల పాలు: ప్రత్యక్ష ప్రభావం
బంగారం, వెండి కొనుగోలుదారులకు ఉపశమనం లభించింది. అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరలు క్షీణతను నమోదు చేశాయి. వెండి ధరలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు వీటిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ 1.3 శాతం తగ్గి 1,40,950 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యాయి. వెండి ఫ్యూచర్స్ కూడా 1.08 శాతం తగ్గి కేజీ 2,35,670 రూపాయలకు చేరుకుంది. సోమవారం నాటితో పోల్చుకుంటే బంగారం ధరలు 10 గ్రాములకు 1,800 రూపాయలకు పైగా తగ్గింది. రిటైల్ గా కూడా వెండి ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముడిచమురు ధరల గమనం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ జారీ చేసే వడ్డీ రేట్ల కీలక ప్రకటనలు అలాగే వివిధ భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తోన్నాయి.

హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్‌కతా నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,41,920 గా కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,30,090 వద్ద లభిస్తోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,070 వద్ద ఉండగా, చెన్నైలో గరిష్టంగా 1,45,080 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరల విషయంలో దేశవ్యాప్తంగా ప్రాంతాల వారీగా తేడాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్, చెన్నైలల్లో కిలో వెండి ధర గరిష్టంగా రూ.2,44,900 గా నమోదైంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరులలో కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా వివిధ రాష్ట్రాల్లో ఉండే స్థానిక పన్నులు, రవాణా ఛార్జీలు, ముడిసరుకు డిమాండ్ ఆధారంగా ధరలు మారుతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణే.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,120, 22 క్యారెట్లు రూ.1,29,360 వద్ద స్థిరపడింది. ఇక్కడ కేజీ వెండి రూ.2,20,530 పలుకుతోంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,890 కాగా 22 క్యారెట్లు రూ.1,29,149 వద్ద నిలిచింది. కిలో వెండి రూ.2,20,180 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,000, 22 క్యారెట్లు రూ.1,29,250 లభిస్తోంది. కిలో వెండి రూ.2,20,360. చెన్నైలో 24 క్యారెట్ల 20 గ్రాముల బంగారం ధర రూ.1,41,300 కాగా 22 క్యారెట్లు రూ.1,29,525, వెండి రూ.2,20,830లకు లభ్యమౌతోంది.












Click it and Unblock the Notifications