ప్రపంచాన్ని గడగడలాడించిన హారర్ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి
ఓటీటీ ప్రియులకు ఈ వారం అసలైన వినోదాల పండగ మొదలుకాబోతోంది! థ్రిల్లర్లు, అదిరిపోయే హారర్ కథలు, నవ్వించే కామెడీ సిరీస్‌లు, సైన్స్ ఫిక్షన్ డ్రామాలతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో ప్రపంచాన్ని భయపెట్టిన ఒక క్రేజీ హారర్ లవ్ స్టోరీతో పాటు, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ వెబ్ సిరీస్ కూడా ఈ వారమే సందడి చేయనున్నాయి.
అమెజాన్ ప్రైమ్
ఆబ్సెషన్ - జూన్ 29 నుంచి
ప్రపంచవ్యాప్తంగా హారర్ లవర్స్‌ను ఒక ఊపు ఊపేసిన లో-బడ్జెట్ సెన్సేషన్ 'ఆబ్సెషన్' ఎట్టకేలకు భారత్‌లో డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. లవర్ కోసం ఒక అమ్మాయి చేసే హారర్ విన్యాసాలు, వెన్నులో వణుకు పుట్టించే సీన్లు ఈ సినిమాకు గ్లోబల్ వైడ్‌గా భారీ క్రేజ్ తెచ్చిపెట్టాయి. కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ హారర్ లవ్ స్టోరీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అదనపు రుసుము చెల్లించి చూసే విధానంలో అందుబాటులోకి వచ్చింది.

ఎల్లే - జూలై 1 నుంచి
ప్రముఖ హాలీవుడ్ చిత్రం 'లీగల్లీ బ్లాండ్' సినిమాకు ఇది ప్రీక్వెల్ సిరీస్. హైస్కూల్ రోజుల్లో ఎల్లే వుడ్స్ జీవితం ఎలా సాగింది అనే కథాంశంతో ఈ 'కమింగ్-ఆఫ్-ఏజ్' డ్రామా రూపొందింది.
నెట్‌ఫ్లిక్స్
సూపర్ సుబ్బు - జూలై 2 నుంచి
సందీప్ కిషన్ లీడ్ రోల్‌లో నటించిన క్రేజీ తెలుగు వెబ్ సిరీస్ ఇది. ఒక పల్లెటూరిలో సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా సందీప్ కిషన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మిథిలా పాల్కర్ నటించారు. వీరిద్దరి భిన్నమైన ప్రపంచాలు ఎలా కలిశాయనేది ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చూపించబోతున్నారు.
ఎనోలా హోమ్స్ 3 - జూలై 1 నుంచి
మిల్లీ బాబీ బ్రౌన్ లీడ్ రోల్‌లో వస్తున్న ఇన్వెస్టిగేటివ్ సిరీస్. మాల్టా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ మూడో పార్ట్‌లో ఎనోలా ఒక సరికొత్త మిస్టరీ కేసును ఛేదించబోతోంది.
హ్యూమన్ వేపర్ - జూలై 2 నుంచి
ఇదొక జపనీస్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్. తన శరీరాన్ని గాలిలా మార్చుకోగల అద్భుత శక్తి ఉన్న ఒక రహస్య వ్యక్తి.. వరుస హత్యలు చేస్తూ పోలీసులకు ఎలా సవాల్ విసిరాడనే సైన్స్ ఫిక్షన్ క్రైమ్ కథాంశంతో ఇది తెరకెక్కింది.
సర్వైవల్ ఆఫ్ ది థికెస్ట్ (సీజన్ 3) - జూలై 2 నుంచి
ఈ పాపులర్ కామెడీ సిరీస్ ఇప్పుడు ఆఖరి సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ ప్రైజ్ మనీ కోసం పోటీపడే కొందరు వ్యక్తుల జీవితాల్లోని శారీరక, మానసిక సవాళ్లను నవ్వులు పూయించేలా ఇందులో చూపించనున్నారు.
జియో హాట్‌స్టార్
మాలీవుడ్ టైమ్స్ - జూలై 3 నుంచి
'ప్రేమలు' ఫేమ్ నస్లెన్ గఫూర్ హీరోగా, అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ చిత్రం. మాలీవుడ్‌ను కాపాడేందుకు ఒక గొప్ప హారర్ డైరెక్టర్ అవ్వాలని కలలుకనే యువకుడి కథ ఇది. థియేటర్లలో హిట్టయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.
ప్రీతమ్ అండ్ పెడ్రో - జూలై 3 నుంచి
అర్షద్ వార్సీ, వీర్ హిరానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్. పాతకాలపు పద్ధతులు ఫాలో అయ్యే సీనియర్ పోలీస్, టెక్నాలజీని నమ్ముకునే యంగ్ పోలీస్.. ఇద్దరూ కలిసి కేసులను ఎలా ఛేదించారనేది ఆసక్తికరంగా ఉంటుంది.
తవ్వై - జూన్ 29 నుంచి
పితృదోషం, దైవ విముక్తి, అలాగే పురాణాల్లోని లక్ష్మి-అలక్ష్మిల మధ్య జరిగే పోరాటం నేపథ్యంగా సాగే హిందీ హారర్ చిత్రం. ఇందులో మనోజ్ జోషి, అర్పిత్ రంకా ముఖ్య పాత్రలు పోషించారు.
జూహీ ముయీ - జూన్ 29 నుంచి
బిగ్ బాస్ 18 ఫేమ్ ఈషా సింగ్ లీడ్ రోల్‌లో నటించిన డైలీ సోప్ డ్రామా. ఆటిజంతో బాధపడే ఒక ప్రతిభావంతురాలైన యువతి, తన సోదరుడి సాయంతో లాయర్‌గా మారి నేరస్థులకు ఎలా బుద్ధి చెప్పిందనేదే ఈ కథ.
ఆపిల్ టీవీ ప్లస్
సైలో (సీజన్ 3) - జూలై 3 నుంచి
ప్రముఖ డిస్టోపియన్ నవలల ఆధారంగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ సిరీస్ 'సైలో' ఇప్పుడు మూడో సీజన్‌తో రాబోతోంది. భూగర్భంలో దాగి ఉన్న మానవ సమాజం వెనుక ఉన్న భయంకరమైన రహస్యాలను వెలికితీసే పాత్రలో రెబెక్కా ఫెర్గుసన్ మరోసారి అలరించనుంది.












Click it and Unblock the Notifications