విఐపిల తాకిడి: శ్రీవారికి నిద్ర కరువు (పిక్చర్స్)
తిరుపతి: వైకుంఠ ఏకాదశి కావడంతో శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు విఐపిల తాకిడి భారీగా పెరిగింది. దీంతో తిరుమలకు వచ్చిన విఐపిల సేవలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు మునిగిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టిటిడి అధికారులు విఐపిల కోసం 8వేల టికెట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. అంతేగాక శ్రీవారికి జరగాల్సిన 108 నామాలకు బదులు 18 నామాల పారాయణానికే పరిమిం చేశారని పలువురు పండితులు ఆరోపణలు కురిపిస్తున్నారు.
విఐపిల తాకిడి పెరగడంతో శ్రీవారికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయని పలువురు పండితులు చెబుతున్నారు. ఇలాంటివి చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు ఆగమ పండితులు అభిప్రాయపడుతున్నారు. అధిక సంఖ్యలో విఐపిలు వస్తున్నందున ఇలాంటివి చోటు చేసుంటున్నాయని మరికొందరు చెబుతున్నారు.
విఐపిలు వచ్చినప్పటికీ స్వామివారికి జరగాల్సిన కైంకర్యాలు చూడాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. కాగా శ్రీవారి దర్శనానికి వచ్చిన పలువురు ఎంపీలు కూడా టిటిడి అధికారుల నిర్లక్ష్య దోరణిపై అసహనం వ్యక్తం చేశారు. తమకు ఒక నిమిషం కూడా దేవున్ని చూసే అవకాశం ఇవ్వలేదని, తమ పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని వారు ప్రశించినట్లు తెలిసింది.
తిరుమలలో ఘనంగా అధ్యయనోత్సవం
తిరుమలలో డిసెంబర్ 31న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ‘తన్నీరముడు' వేడుకతో జనవరి 25న ముగుస్తాయి. వేద పండితులు ‘అల్వార్ దివ్య ప్రబంధం' వైభవంగా నిర్వహించారు. అధ్యయనోత్సవంలో మొదటి 11 రోజులను పాగల్పట్టు అని, ఆ తర్వాతి రోజులను రాపట్టు అని పిలుస్తారు.
22 రోజున కన్నీనన్ సిరుత్తంబు, 23న రామనుజ నుట్రండడి, 24న వరహా స్వామి సత్తుమురాయి, అధ్యయనోత్సవం చివరి రోజున తన్నీరముడు వేడుకతో ముగుస్తుందని వేదపండితులు తెలిపారు. ఈ ఉత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్ కె. బాపిరాజుతోపాటు ఇతర ఆలయ అధికారులు హాజరయ్యారు.

అధ్యయనోత్సవం
తిరుమల దేవస్థానంలో డిసెంబర్ 31న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ‘తన్నీరముడు' వేడుకతో జనవరి 25న ముగుస్తాయి. వేదమంత్రాలతో శ్రీవారికి పూజలు నిర్వహిస్తున్న వేదపండితులు.

అలంకరణలో దేవదేవుడు
తిరుమల దేవస్థానంలో డిసెంబర్ 31న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ‘తన్నీరముడు' వేడుకతో జనవరి 25న ముగుస్తాయి. ఉత్సవాల్లో దేవదేవుడిని అందంగా అలరించిన దృశ్యం.

పూలతో ముస్తాబు
తిరుమల దేవస్థానంలో డిసెంబర్ 31న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ‘తన్నీరముడు' వేడుకతో జనవరి 25న ముగుస్తాయి. పూలమాలల అలంకరణతో దీపకాంతుల్లో శోభాయమానంగా వెలుగిపోతున్న ఆలయం లోపలి దృశ్యం.

శ్రీవారి శోభ
తిరుమల దేవస్థానంలో డిసెంబర్ 31న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ‘తన్నీరముడు' వేడుకతో జనవరి 25న ముగుస్తాయి. పూలమాలల అలంకరణతో దీపకాంతుల్లో శోభాయమానంగా వెలుగిపోతున్న శ్రీవారు.

గోవింద మాలదారులు
తిరుమల దేవస్థానంలో డిసెంబర్ 31న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ‘తన్నీరముడు' వేడుకతో జనవరి 25న ముగుస్తాయి. గోవింద మాల వేసుకున్న భక్తులు శ్రీవారి ఆలయానికి చేరుకు మొక్కులు పెడుతున్న దృశ్యం.

దీపకాంతుల్లో తిరుమల
తిరుమల దేవస్థానంలో డిసెంబర్ 31న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ‘తన్నీరముడు' వేడుకతో జనవరి 25న ముగుస్తాయి. వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దీపకాంతుల్లో శోభామానంగా వెలిగిపోతున్న శ్రీవారి ఆలయం.












Click it and Unblock the Notifications