ఏపీ హైకోర్టు జడ్డిపై ట్రోల్స్..! చంద్రబాబు జోక్యం కోరిన లాయర్లు..!
ఏపీ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. హైకోర్టులో దాఖలైన వివిధ పిటిషన్లపై ఆయన ఇస్తున్న తీర్పులపై అధికార పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపై నిన్న జస్టిస్ శ్రీనివాసరెడ్డి నేరుగా బెంచ్ పైనే స్పందించి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారించాల్సిన రెండు బెయిల్ పిటిషన్లను విచారించేందుకు నిరాకరించి వేరే బెంచ్ కు బదిలీ చేశారు.
తాజాగా వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ నేతలపై నమోదైన కేసులు, మరో నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల బెయిల్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న కాకినాడ పోర్టు వాటాల కేసు, అమరావతిపై వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజుకు బెయిల్ వంటి పిటిషన్లలో నిందితులకు అనుకూలంగా తీర్పులు రావడం, ఇవన్నీ శ్రీనివాసరెడ్డి ఇవ్వడంతో ఆయనపై ట్రోల్స్ వచ్చాయి.

దీనిపై ఆయనే స్వయంగా స్పందించి ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇవాళ ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కూడా స్పందించింది. జడ్జి శ్రీనివాసరెడ్డిపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ ను ఖండిస్తున్నట్లు పేర్కొంది. అంతే కాదు ఈ దాడులు జడ్డి ప్రతిష్టను దిగజార్చడంతో పాటు న్యాయవ్యవస్థ పవిత్రతను కూడా దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది. న్యాయమూర్తులు రాజ్యాంగం ప్రకారం తమ విధుల్ని ఎలాంటి భయం, ఆందోళన లేకుండా నిర్వహించాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది.
ఎవరైనా జడ్జి ఇచ్చిన తీర్పు నచ్చకపోతే దాన్ని న్యాయప్రక్రియ ద్వారా సవాలు చేసే అవకాసం ఉందని, అంతే కాని దానిపై బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని అడ్వకేట్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జడ్డి శ్రీనివాసరెడ్డిపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే న్యాయప్రక్రియ పవిత్రతను కాపాడేందుకు మీడియా, న్యాయవ్యవస్ధలో భాగస్వాములు, సాధారణ ప్రజలు కూడా ఈ వ్యవహారంపై స్పందించాలని కోరింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications