APలో రోడ్డుపై దిగనున్న విమానాలు

ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారిపై ఈనెల 29వ తేదీన విమానాలు ల్యాండ్ కానున్నాయి. విజయవాడ - ఒంగోలు మధ్య 16వ నెంబరు జాతీయ రహదారిపై ఈ డ్రిల్ జరగనుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు చెందిన విమానాల ల్యాండింగ్ కు అనుకూలంగా ఉండేలా జాతీయ రహదారిలో కొంత మార్పులు చేశారు.

బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం రేణింగవరం, కొరిశపాడు గ్రామాల మధ్య హైవేపై అత్యవసర సమయాల్లో విమానాలు దిగేందుకు 4 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్డు నిర్మించారు. ఈనెల 29వ తేదీ ఉదయం 11.00 గంటలకు ఒక కార్గో విమానం, రెండు జెట్ ఫైటర్ లు ట్రయల్ రన్ లో భాగంగా దిగనున్నాయి. ఈ సందర్భంగా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు.

aeroPlanes landing on road in Andhra pradesh

2017 అక్టోబర్‌లో తొలిసారిగా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఫైటర్‌ జెట్లు, రవాణా విమానాలను లక్నో - ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ మార్గంపై ప్రయోగాత్మకంగా అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఈ తరహా సదుపాయాలను మెరుగుపరుస్తూ వస్తున్నారు. వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భంగా ఈ ఎయిర్ స్ట్రిప్ లను ఉపయోగించుకోనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలను క్షేమంగా నేలపైకి దించడానికి జాతీయ రహదారులను ఎంపిక చేశారు.

వీటికోసం అనువుగా మార్పులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని నెల్లూరు-ఒంగోలు, ఒంగోలు-చిలకలూరిపేట మార్గాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రహదారులపై విమానాల అత్యవసర ల్యాండింగ్ అనేది యుద్ధ సమయాల్లోనే కాకుండా ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలోను బాగా ఉపయోగపడుతుందని మరో మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+