Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మొన్న బాలయ్య- నేడు అశోక్‌ గజపతిరాజు- మహిళా దినోత్సవం రోజున మహిళపై దాడి

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలు శ్రుతి మించుతున్నారు. ప్రత్యర్ధుల చేతుల్లో ఓడిపోతున్నామనే ఆక్రోశమో లేక ఏమీ చేయలేకపోతున్నామన్న బాధో తెలియదు కానీ సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులపైనే దాడులకు దిగుతున్నారు. తాజాగా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ తన అభిమానిపై చేయి చేసుకున్న ఘటన మర్చిపోక ముందే ఇవాళ మహిళా దినోత్సవం రోజున విజయనగరం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు ఓ మహిళపై చేయి చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.

మహిళను చాచి కొట్టిన అశోక్‌ గజపతిరాజు

టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు ఇవాళ రెచ్చిపోయారు. విజయనగరం జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో తనకు పూలు ఇచ్చేందుకు వచ్చిన మహిళపై దాడి చేశారు. అసహనంతో ఆమెపై రెచ్చిపోయి కొట్టారు. దీంతో ఆ మహిళకు తీవ్ర అవమానం జరిగింది. అవమానం భరించలేక ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తమ అభిమాన నేత కదాని పూలు ఇచ్చేందుకు వస్తే కొట్టి పంపించారని మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.

 అసలు ఏం జరిగిందంటే ?

అసలు ఏం జరిగిందంటే ?

విజయనగరం నియోజకవర్గంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ అశోక్‌ గజపతిరాజు పాల్గొంటున్నారు. మహిళా దినోత్సవం కూడా కావడంతో మహిళలు పెద్ద ఎత్తున పూలతో వచ్చి తమ అభిమాన నేత అశోక్‌ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో మహిళలు తోసుకోవడంతో అశోక్ మీద పడినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అసహనానికి లోనైన అశోక్‌ గజపతిరాజు తనపై పడిన మహిళను ఆమె వద్దకు వెళ్లి మరీ మెడ వంచి మరీ కొట్టినట్లు సమాచారం. దీంతో వెంటనే తేరుకున్న అశోక్.. సముదాయించుకునే లోపే ఆ మహిళ అవమానంగా భావించి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

విమెన్స్‌ డే రోజు పురుషాహంకారమా అన్న సంచైత

విమెన్స్‌ డే రోజు పురుషాహంకారమా అన్న సంచైత

మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వంతో పాటు ఇతర పార్టీలు కూడా మహిళలకు శుభాకాంక్షలు తెలిపాయి. ప్రభుత్వం కూడా మహిళా దినోత్సవం సందర్భంగా పలు నిర్ణయాలు ప్రకటిస్తోంది. ఇదే సమయంలో మహిళా దినోత్సవం అని కూడా చూడకుండా ఓ మహిళపై, అదీ సొంత పార్టీ కార్యకర్తపై సీనియర్‌ రాజకీయవేత్తగా ఉన్న అశోక్‌ గజపతిరాజు చేయిచేసుకోవడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. దీన్ని చూసిన వారంతా అశోక్‌ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. దీనిపై స్పందించిన అశోక్‌ అన్న కూతురు, మాన్సాస్‌ ఛైర్‌పర్సన్ సంచైత కూడా తీవ్రంగా తప్పుబట్టారు. మహిళా దినోత్సవం రోజు పురుషాహంకారం చూపిస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఓ మహిళా ద్వేషి నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేమన్నారు.

మొన్న బాలయ్య- ఇవాళ అశోక్‌

మొన్న బాలయ్య- ఇవాళ అశోక్‌

తాజాగా హిందూపురం నియోజకవర్గంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన స్ధానిక టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అక్కడ తన ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన ఓ అభిమాని చెంపచెళ్లుమనిపించారు. ఇది కాస్తా వివాదాస్పదం అయ్యేలా కనిపించడంతో తిరిగి అభిమానిని దగ్గరికి తీసుకుని ఊరడించారు. చివరికి అభిమాని కూడా బాలయ్య చెంపదెబ్బ కొట్టడాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని చెప్పేయడంతో వివాదం సద్దుమణిగింది. కానీ తాజాగా అశోక్‌ గజపతిరాజు వ్యవహారంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. అయితే టీడీపీ నేతలు సొంత కార్యకర్తలపై చేస్తున్న వరుస దాడులపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+