వెన్నుపోటు దినం సక్సెస్.. ! వైసీపీ నెక్ట్స్ ప్లాన్ రెడీ..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినానికి పిలుపుచ్చి ర్యాలీలు నిర్వహించిన వైసీపీ ఆశించిన ఫలితాన్ని అందుకున్నట్లే కనిపిస్తోంది. వెన్నుపోటు దినం జరిగిన తీరుపై ఇవాళ వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నాయకులతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మరో కీలక నిర్ణయం ప్రకటించారు.
ఈ నెలాఖరులోగా 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. చంద్రబాబు పాలన ఏడాది వైఫల్యాలు, వైయస్ జగన్ తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యం చేసిన విధానంపై వివిధ రంగాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని ఈ సందర్భంగా పార్టీ నేత సజ్జల తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ పోరాటాలకు కొనసాగింపుగా ఈ నెలాఖరులోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిద్దామని సజ్జల పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో కీలక రంగాలకు సంబంధించి గతంలో వైయస్ జగన్ పాలన, ఈ ఏడాదిలో ఏ విధంగా నాశనం చేశారనేది, ఒక్కో రంగాన్ని ఎలా నిర్వీర్యం చేశారనేది చెప్పాలని సూచించారు. వ్యవస్ధలు నాశనం చేయడం, ఏ విధంగా అరాచకం చేస్తున్నారు అనేది, ప్రభుత్వ వైఫల్యాలపై స్పష్టంగా చర్చ జరిగి ప్రజల్లోకి వెళ్ళాలని సూచించారు.
విద్యార్ధులు, మహిళలు, యువత, రైతులు ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చ జరగాలన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకపాలన ద్వారా రాష్ట్రం ఎలా నష్టపోయిందనేది చెప్పగలగాలన్నారు. రెడ్‌బుక్ పాలన పేరుతో చేస్తున్న అరాచకాలు ఇలా అన్నీ బయటికి రావాలని, ఉమ్మడి 13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో 13 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటుచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఆయా రంగాల్లోని నిష్ణాతులు, మేధావులు, సివిల్ సొసైటీ సభ్యులు, రిటైరైన అధికారులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, సోషల్ వర్కర్‌లు, రైతుసంఘం నాయకులు, అనుభవమన్న తటస్ధులు ఇలా అందరినీ భాగస్వామ్యం చేద్దామని సూచించారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications