గుంటూరులో మరో దారుణం: బాలికపై తాపీకూలి అత్యాచారం..
గుంటూరు: దాచేపల్లి అత్యాచార ఘటనతో దావానంలా ఎగసిపడ్డ నిరసనలు ఇంకా చల్లారనేలేదు, ఇంతలోనే జిల్లాలో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. తాజా ఘటనలో ఓ తాపీకూలీ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరులో ఈ ఘటన జరిగింది. నిందితుడిని నాగూర్ మీరాగా గుర్తించారు. ఘటనపై బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నారు. 'ఆడబిడ్డకు అండగా కదులుదాం' అంటూ ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రోజే ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం.

ఆడబిడ్డకు అండగా కదులుదాం:
బాలికలు, మహిళలపై లైంగిక దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం 'ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం' ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ వేదికగా జరిగే రాష్ట్రస్థాయి ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి తన మద్దతు తెలిపారు. ఈమేరకు చంద్రబాబుకు ఆయన ఫోన్ చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కార్యకర్తలు పాల్గొంటారని, తాను కూడా హాజరవుతానని చంద్రబాబుతో సత్యార్థి కైలాష్ చెప్పినట్టు సమాచారం.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications