వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు బాగా ఇష్టమైన పని ఎత్తుకున్నా -మండలి రద్దుకు పోరాడుతా -తెలుగు కోసం పక్క రాష్ట్రాలకు: రఘురామ

|
Google Oneindia TeluguNews

సొంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన తర్వాతి మిషన్ ఏంటో వెల్లడించారు. సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై వాదనలు ముగిసి, తీర్పు రిజర్వ్ కాగా, ఏ2 విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కూడా పిటిషన్ వేస్తానన్న రెబల్ ఎంపీ, దాని తర్వాత జగన్ కు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ అయిన శాసన మండలి రద్దు కోసం ఢిల్లీలో పోరాటం చేస్తానన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఇంగ్లీష్ మీడియం, కరోనా వేళ బడుల రీఓపెనింగ్, టిడ్కో ఇళ్లపైనా మాట్లాడారు. ప్రెస్ మీట్ లో రఘురామ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామజగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

ఏపీలో అంతా ఆంగ్ల మయం..

ఏపీలో అంతా ఆంగ్ల మయం..


''అంతా రామమయం.. అనే సినిమా పాట తరహాలో ఏపీలో 'అంతా ఆంగ్ల మయం' అని ఒక పేపర్ లో వార్త రాశారు. ఒకవైపు హైకోర్టు దీన్ని వద్దన్నా, సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించినా, కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకొచ్చినా, భారత ఫెడరల్ వ్యవస్థలో తాను భాగం కాదన్న రీతిలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇంజనీరింగ్ కోర్సులను కూడా 11 ప్రాంతీయ భాషల్లో బోధిస్తామని ప్రధాని మోదీ చెబుతోంతే, ఏపీ సీఎం మాత్రం మాతృభాషను నిర్మూలించే పనిని వేగవంతం చేశారు...

జగన్ బెయిల్ రద్దు: సాయిరెడ్డికి దేహశుద్ధి -కొట్టింది ఎవరో తెలుసా? -ఇంకొద్ది గంటల్లోనే: ఎంపీ రఘురామజగన్ బెయిల్ రద్దు: సాయిరెడ్డికి దేహశుద్ధి -కొట్టింది ఎవరో తెలుసా? -ఇంకొద్ది గంటల్లోనే: ఎంపీ రఘురామ

తెలుగు కోసం తమిళనాడుకు..

తెలుగు కోసం తమిళనాడుకు..

ప్రైమరీ స్థాయి దాకా బోధన మాతృభాషలోనే జరగాలని నూతన జాతీయ విద్యా విధానం చెబుతోంటే, ఏపీ సీఎం జగన్ మాత్రం ప్రీప్రైమరీ స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియం బోధన చేసేందుకు కంకణం కట్టుకున్నారు. మరి ఏపీ పిల్లలు తెలుగు చదువుకోవాలంటే తమిళనాడు పోవాలా? మిగతా రాష్ట్రాలన్నీ మాతృభాష పరిరక్షణ కోసం తపిస్తోంటే, జగన్ మాత్రం తెలుగును పూర్తిగా నిర్మూలించాలనుకుంటున్నారు. ఈ విషయంలో కోర్టులు మరోసారి చెంప దెబ్బలు కొట్టకముందే, రాజ్యాంగాన్ని గౌరవించాలని, తెలుగు విషయంలో సముచిత నిర్ణయాలు తీసుకోవాలని సీఎంను నేను కోరుతున్నా..

కేసుల భయంతో పేరెంట్స్ మౌనం

కేసుల భయంతో పేరెంట్స్ మౌనం

కరోనా విలయ కాలంలో మళ్లీ బడులు తెరిచే ప్రయత్నాలను జగన్ సర్కారు మానుకోవాలి. దేశంలోనే అత్యధిక కేసుల జాబితాలో మహారాష్ట్ర, కేరళ తర్వాత ఏపీ మూడో స్థానంలో ఉంది. (నిజానికి ఏపీ 5వ స్థానంలో ఉంది). అలాంటి పరిస్థితిలో జగన్ తన సహజీవన సిద్ధాంతం స్ఫూర్తితో ఆగస్టు 16 నుంచి స్కూళ్లు తెరుస్తామంటున్నారు. దయచేసిన పిల్లల మనసులు అర్థం చేసుకోండి. ఎవరైనా తమ కష్టాన్ని చెప్పుకుంటే ఎడా పెడా కేసులు పెడుతున్నారు కాబట్టి, స్కూళ్ల రీఓపెనింగ్ విషయంలో పేరెంట్స్ మౌనం వహిస్తున్నారు. ముఖ్యమంత్రే మనసు మార్చుకోవాలి..

6 నెలల్లోగా ఇళ్లు ఇచ్చేయండి..

6 నెలల్లోగా ఇళ్లు ఇచ్చేయండి..


ఏపీలో టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇచ్చే విషయంపై మంత్రి బొత్సా సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. పనులన్నీ పూర్తయినా, ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి, ఇళ్లు ఇవ్వడానికి మరో 18 నెలల సమయం పడుతుందని చెప్పారు. ఈ విషయమై కొంత మంది నాకు ఫోన్లు చేసి తిడుతున్నారు. ఎందుకంటే వైసీపీ ప్రజాప్రతినిధుల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నది నేనే కాబట్టి. కట్టిన ఇళ్లు ఇవ్వడానికే ఇంత సమయం పడితే, మరి కట్టబోయే జగనన్న కాలనీలకు ఇంకెంత సమయం పడుతుంది? మంత్రి చెప్పినట్లు టిడ్కో ఇళ్లను18 నెలలు కాకుండా 6 నెలల్లోనే పూర్తి చేసి ఇవ్వాలని కోరుతున్నా. చివరిగా..

జగన్ మానస పుత్రిక కోసం పోరాటం

జగన్ మానస పుత్రిక కోసం పోరాటం

వైసీపీ నుంచి నన్ను ఇంకా బహిష్కరించలేదు. అయినా కూడా ఎంపీల సమావేశానికి నన్ను పిలవడం లేదు. మా పార్టీకి చెందిన మిగతా ఎంపీలందరూ సాయిరెడ్డి నాయకత్వంలో పైకి ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, విశాఖ ఉక్కు అంటున్నారు గానీ, సభలో మాత్రం నా అనర్హతవేటు కోసమే ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ఎలాగో నన్ను పిలవట్లేదు కాబట్టి, నేనింకా వైసీపీ ఎంపీనే కాబట్టి, మా సీఎం జగన్ మానసపుత్రిక, ఆయనకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ ను తలకెత్తుకోబోతున్నాను. ఏపీలో శాసన మండలి రద్దు కోసం ఢిల్లీ వేదికగా నా ప్రయత్నాలు చేస్తాను. మండలి రద్దు ఇప్పటికే పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయ శాఖ ఇటీవలే చెప్పింది. న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీలో సభ్యుడినైన నేను మీటింగ్స్ లో ఈ అంశాన్ని లేవనెత్తుతా..'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju told media that his party is not inviting for any meeting and he will fight for cm jagan favourite subject, i.n, ap legislative council cancellation. speaking to media on friday, the rebel mp slams ap govt decision on english medium and schools reopening in covid crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X