హిందీపై తేల్చేసిన జగన్..! పవన్, లోకేష్ కామెంట్స్ వేళ..!

హిందీ జాతీయ భాష కాదా అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. జాతీయ విద్యావిధానం, పీఎం శ్రీ స్కూల్స్ ద్వారా హిందీని అన్ని రాష్ట్రాలపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీలోనూ ఈ చర్చ మొదలైంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ పెద్దమ్మ అని కామెంట్స్ చేయగా.. నారా లోకేష్ అయితే హిందీ జాతీయ భాషేనంటూ ఓ జాతీయ మీడియా ఇంటర్వూలో చెప్పారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా హిందీపై స్పందించారు.

హిందీ జాతీయ భాషగా ఉండాలా అన్న ప్రశ్నకు జగన్ స్పందిస్తూ.. హిందీ విషయంలో మార్పు అవసరం లేదని, ఇంగ్లీష్ లో బోధన అనేది జరగాలన్నారు. ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ అని, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మాధ్యమం అమలు కానంతవరకూ, పేదలకు ఇంగ్లీష్ బోధన అమలు కానంతవరకూ మార్పు రాదన్నారు. విద్యార్ధులకు ఇంగ్లీష్ ను ఎంచుకునే అవకాశం ఇవ్వాలని, అలాగే మాతృభాషను కూడా తప్పనిసరిగా నేర్చుకోనివ్వాలన్నారు.

after pawan kalyan and nara lokesh ys jagan also says hindi is national language

తాను చదివిన ఇంగ్లీష్ మీడియం స్కూల్లోఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఉండేదని, సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగు ఉండేదని జగన్ గుర్తుచేసుకున్నారు. హిందీ ఓ భాషగా ఉంటే తప్పులేదన్నారు. హిందీని జాతీయ భాష చేయాలని కోరతారా అని అడిగిన ప్రశ్నకు.. హిందీ జాతీయ భాషేనని, ఇందులో మళ్లీ అడగాల్సిన అవసరం ఏముందని జగన్ తేల్చేశారు. దీంతో తాజాగా పవన్, లోకేష్ చేసిన వాదనకు జగన్ కూడా మద్దతు పలికినట్లయింది.

హిందీ తప్పనిసరి అమలుపై మహారాష్ట్ర వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. హిందీపై దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్డీయే పాలిత రాష్ట్రమైన ఏపీలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హిందీని జాతీయ భాష అంటూ చేస్తున్న వాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కూడా అదే వాదన వినిపించడం చూస్తుంటే కేంద్రంలో పెద్దల్ని ఇబ్బంది పెట్టకూడదని భావిస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+