పవన్ కళ్యాణ్ నిలదీత, ఢిల్లీలో బీజేపీపై గళమెత్తిన టీడీపీ ఎంపీ

అమరావతి: విశాఖలోని డీసీఐ ప్రయివేటీకరణపై ఏపీ ఎంపీలు తమిళనాడు నేతలను ఆదర్శంగా తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఆయన సూచన చేసిన రోజే ఏపీ ఎంపీలీ ఆ అంశంపై స్పందించారు.

డ్రెడ్జింగ్ కార్పొరేషన్(డీసీఐ) అంశాన్ని ఎంపీలు మంగళవారం సభలో లేవనెత్తారు. డీసీఐ ప్రయివేటీకరణ దేశ భద్రతకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చర్చకు ఎంపీలు విజయ్ సాయి రెడ్డి, కేవీపీ రామచంద్రరావు పట్టుపట్టారు.

కేంద్రం నిర్ణయం బాధాకరమని టీడీపీ నేత

కేంద్రం నిర్ణయం బాధాకరమని టీడీపీ నేత

పోర్టుల నుంచి డీసీఐకు బకాయిలు ఇప్పించాలని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ప్రయివేటీకరణ అంశంపై కేంద్రమంత్రి గడ్కరీని కలుస్తామని చెప్పారు. డీసీఐ సంస్థను 1971లో ఏర్పాటు చేశారని, అందులో కార్మికులు సంస్థ అభివృద్ధి కోసం బాగా పని చేస్తున్నారన్నారు. అలాంటి కంపెనీని ప్రయివేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయించడం బాధాకరమన్నారు.

చర్చించాల్సి ఉంది

చర్చించాల్సి ఉంది

డీసీఐ విషయమై కేవీపీ రామచంద్రరావు ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. ప్రయివేటీకరణ ప్రమాదకరమని, 1700 మంది కార్మికుల భవిష్యత్ ఆందోళనలో పడుతుందన్నారు. ఇప్పటికే ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. డీసీఐ ప్రయివేటీకరణపై పార్లమెంట్‌లో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

శిక్షణా కేంద్రం

శిక్షణా కేంద్రం

డీసీఐ అంశంపై ఎంపీలు ప్రశ్నల వర్షం కురిపించారు. జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. డీసీఐ ప్రయివేటీకరణను వెంటనే ఆపివేయాలన్నారు. అంతర్వేదీలో డీసీఐ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అవంతి శ్రీనివాస్ కోరారు.

అలా చేయండి

అలా చేయండి

పవన్ కళ్యాణ్ మంగళవారం ఎంపీలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో వరుస పోస్టులు పెట్టారు. తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రధాని మోడీకి సేలమ్ స్టీల్ ప్లాంట్‌పై ఇస్తున్న మెమోరాండాన్ని కూడా పోస్ట్ చేశారు. సేలమ్ స్టీల్ ప్లాంటును ప్రయివేటీకరించవద్దని శనివారం పళని ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిని ఉదహరిస్తూ ఏపీ రాజకీయ నాయకులు కూడా అలాగే వ్యవహరించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+