ప్రధాని, సీఎం తర్వాత మీరే- కలెక్టర్లను ఆకాశానికెత్తేసిన చంద్రబాబు..!
ఏపీలోని అమరావతి సచివాలయంలో ఇవాళ కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఇందులో ప్రారంభోపన్యాసం చేసిన చంద్రబాబు కలెక్టర్ల బాధ్యతల్ని గుర్తుచేశారు. అదే సమయంలో వారి పాత్ర ఎంత కీలకమైందో గుర్తుచేసేలా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాలన పరుగులు పెట్టించాలంటే వారిదే కీలక పాత్ర అన్నారు. కాబట్టి ప్రతీ కలెక్టర్ తమ వంతుగా బాధ్యత తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
కూటమి ప్రభుత్వం 15 నెలల పాలన పూర్తి చేసుకుందని, భారత్ నెంబర్ 1 కావాలన్న ఆకాంక్షతోనే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. భారత ఆర్ధిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4 స్థానానికి చేరుకుందన్నారు. గతంలో అమెరికాను అగ్రస్థానంలో చూసేవాళ్లం. ఇప్పుడు భారత్ ఆ దేశానికి సమాన స్థాయికి వెళుతుందన్నారు. మరో 22 ఏళ్లలో స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తి అవుతుంది. ఆ సమయానికి భారత్ కూడా అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు.

సంస్కరణలు వద్దన్న చాలా రాజకీయ పార్టీలు మనుగడలో లేకుండా పోయాయని సీఎం గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వానిది ఓ నిర్దిష్టమైన విధానమన్నారు. కేంద్రం 2047 వికసిత్ భారత్ ప్రణాళిక తయారుచేస్తే ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపొందించిందన్నారు. ఇది అధికారులందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలన్నారు. భారత్ అభివృద్ధికి తోడుగా ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస్థానానికి ఎదగాలన్నారు. సీఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకూ సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియమాకాలు చేశామన్నారు.

సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ మంత్రులను నియమించి కేబినెట్ కూర్పు చేశామని సీఎం తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్- డబుల్ ఇంజన్ గ్రోత్ ఉండాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నట్లు వారికి వివరించారు. 2047 వరకూ 15 శాతం వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కలెక్టర్ల సదస్సు ద్వారా జరిగే చర్చలో ప్రతీ నిముషం సద్వినియోగం కావాలన్నారు. ప్రస్తుతం వృద్ధిరేటు 10.5 శాతం ఉందని, ఈ ఏడాది తలసరి ఆదాయాన్ని రూ.3.47 లక్షలకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 2029 నాటికి రూ.29 లక్షల జీఎస్డీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అప్పటికి రూ.4.67 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా పనిచేయాలని కోరారు.

ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అందరినీ సాధికారిత దిశగా నడిపిస్తామని చెప్పిన హామీని విశ్వసించే ఎన్డీఏ కూటమికి ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారన్నారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లకు ప్రజల తరపున, తమ తరపున శుభాభినందనలు తెలిపారు. కొనసాగుతున్న కలెక్టర్లు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులని చంద్రబాబు తెలిపారు. జిల్లా రూపు రేఖల్ని మార్చటంలో వారిదే ప్రధాన బాధ్యత అన్నారు. ప్రభుత్వం రూపొందించిన విధానాలను సక్రమంగా అమలు చేసేది కలెక్టర్లే అన్నారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications