Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

త్వరలో మీడియా ముందుకు ఆనం ? భవిష్యత్తుపై ప్రకటన- మార్చిలో కీలక నిర్ణయం !

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సొంత పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఆయన్ను పక్కనబెట్టిన జగన్.. తాజాగా వెంకటగిరిలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన్ను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో రగిలిపోతున్న ఈ సీనియర్ నేత.. త్వరలో ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు.

ఆనం రామనారాయణరెడ్డికి షాకులు

ఆనం రామనారాయణరెడ్డికి షాకులు

వైసీపీ నుంచి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీపైనే కొంతకాలంగా అసంతప్త వ్యాఖ్యలు చేస్తున్న ఆనం రామనారాయణరెడ్డికి అధిష్టానం వరుస షాకులిస్తోంది. ఇప్పటికే వెంకటగిరిలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇన్ ఛార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అవకాశమిచ్చిన జగన్.. స్ధానికంగా అధికారుల మార్పు, ఇతర అంశాల్లోనూ ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు, అధికారులు, పోలీసులు ఇలా ఎటు చూసినా ఆనంకు సహాయనిరాకరణ తప్పడం లేదు. తాజాగా గడప గడపకూ కార్యక్రమం నిర్వహించవద్దంటూ ఆదేశాలు పంపిన అధిష్టానం.. నేదురుమల్లి రామ్ తో కలిసి వెళ్లాలని సూచించింది. దీంతో తనకు ఎంతో జూనియర్ అయిన నేదురుమల్లి వారసుడి చేతిలో దారుణమైన అవమానం తట్టుకోలేకపోతున్నారు.

 రగిలిపోతున్న ఆనం ?

రగిలిపోతున్న ఆనం ?

వెంకటగిరి నియోజకవర్గంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై సీనియర్ రాజకీయ నేత అయిన ఆనం రామనారాయణరెడ్డి రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే వెంటనే ఏమీ చేసేందుకు వీల్లేకపోవడంతో తన భవిష్యత్ రాజకీయాలపై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆనంకు జరుగుతున్న వరుస అవమానాలపై ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రత తగ్గింపు, సహాయనిరాకరణతో పాటు తోటి ఎమ్మెల్యేలతో విమర్శలు చేయించడం వంటి పరిణామాల్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆనంపై వారు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారు.

త్వరలో ఆనం ప్రెస్ మీట్ ?

త్వరలో ఆనం ప్రెస్ మీట్ ?

వెంకటగిరి నియోజకవర్గంలో గత నెల రోజుల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆగ్రహంగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి భవిష్యత్ ప్రణాళికను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా త్వరలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ రాజకీయ నాయకుడైన తనకు వైసీపీలో ఎదురవుతున్న అవమానాలపై ఆనం స్పందించబోతున్నారు. అలాగే భవిష్యత్ ప్రణాళికలపైనా ఆయన ఈ ప్రెస్ మీట్లో ఓ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆనం ప్రెస్ మీట్ పై ఉత్కంఠ నెలకొంది.

ఆనం ఫ్యూచర్ ప్లాన్ ఇదేనా ?

ఆనం ఫ్యూచర్ ప్లాన్ ఇదేనా ?

వైసీపీలో ఎదురవుతున్న అవమానాల నేపథ్యంలో వెంటనే పార్టీ మారేందుకు ఆనం సిద్ధంగానే ఉన్నారు. అదే సమయంలో ఆయనకు టీడీపీ నుంచి ఆఫర్లు కూడా ఉన్నాయి. పార్టీ మారి వెంకటగిరి నుంచి లేదా ఆత్మకూరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆనం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కుదరని పక్షంలో తన కుమార్తె, రాజకీయ వారసురాలైన కైవల్యారెడ్డిని ఆత్మకూరు నుంచి బరిలోకి దింపేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలే వైసీపీకి మద్దతుగా ఉండే రెడ్ల హవా ఉన్న జిల్లా కావడం, స్ధానిక నేతల మద్దతు లేకుండా రిస్క్ చేస్తే ఇబ్బందులు తప్పవన్న అంచనాల నేపథ్యంలో వెంకటగిరి రాజుల మద్దతు కొనసాగేలా ఆనం చూసుకునే అవకాశముంది. ఏదేమైనా ఈ ఏడాది మార్చిలో తన రాజకీయ భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ ఉండేలా ఆనం చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+