Naa Kala: మరో పవర్ ఫుల్ నినాదం రెడీ చేసుకున్న జగన్ ..!
ఏపీలో వచ్చే ఎన్నికలకు వైసీపీని పూర్తిస్దాయిలో సిద్ధం చేసుకున్న సీఎం వైఎస్ జగన్ తాజాగా సిద్ధం పేరుతో కొత్త నినాదం వినిపించారు. తొలుత ఉత్తరాంధ్రలోని భీమిలిలో, ఆ తర్వాత కోస్తాలోని ఏలూరులో, దాని తర్వాత రాయలసీమలోని రాప్తాడులో సిద్ధం పేరుతో జగన్ సభలు నిర్వహించారు. ఇప్పుడు పల్నాడులో నాలుగో సిద్దం సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని తర్వాత సిద్దం సిరీస్ ముగియనుంది. ఆ తర్వాత నా కల పేరుతో సభలు పెట్టేందుకు జగన్ సిద్దమవుతున్నారు.
ఇప్పటికే నిర్వహించిన భీమిలి సిద్దం సభకు 3 లక్షలు, ఏలూరు సభకు 5 లక్షలు, రాప్తాడు సభకు 10 లక్షలు జన సమీకరణ చేసిన వైసీపీ.. త్వరలో పల్నాడులో జరిగే సిద్ధం సభకు 15 లక్షల మందిని టార్గెట్ పెట్టుకుంది. దీంతో సిద్దం సభలు పూర్తవుతాయి. అనంతరం నాకు ఓ కల ఉంది అంటూ జగన్ ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతీ నగరం, ప్రతీ వాడలో కార్మికులతో, పిల్లలతో, అవ్వతాతలతో, అక్కచెల్లమ్మలతో, రైతులతో జగనన్న ఉన్న ఫోటోతో "మీ కల నా కల" పేరుతో స్లోగన్స్ కనిపిస్తున్నాయి.

ప్రజల కలే తన కలగా చెబుతూ అవి నేరవేర్చే దిశగా అడుగులు వేస్తానంటూ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఈ మొత్తం మీ కల నా కల ప్రచారంలో మొత్తం 6 వర్గాల ప్రజలకు చెందిన హోర్డింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రైతుల కల -జగనన్న కల, కార్మికుల కల-జగనన్న కల, విద్యార్ధుల కల-జగనన్న కల, యువత కల -జగనన్న కల, అవ్వాతాతల కల-జగనన్న కల, అక్కచెల్లెమ్మల కల-జగనన్న కల వంటి స్లోగన్లు కనిపిస్తున్నాయి.

రైతుల కల-జగనన్న కలలో రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు అందించిన వివిధ పథకాల సాయాన్ని గుర్తుచేయబోతున్నారు.
అలాగే కార్మికుల కల - జగనన్న కలలో కార్యికులు శ్రమజీవులని వారి ఆదాయ మార్గాలు చూపుతూ ఎలా ఆదుకున్నారో వివరిస్తారు. ఆ తర్వాత విద్యార్ధుల కల - జగనన్న కలలో విద్యారంగంలో చేపట్టిన పెను మార్పులు, అవి విద్యార్ధుల జీవితాల్ని ఎలా ప్రభావితం చేశాయో వివరించనున్నారు. ఆ తర్వాత యువత కల - జగనన్న కలలో నిరుద్యోగులకు కల్పించిన ఉద్యోగాలు, ఇతర సాయాలు గుర్తుచేస్తారు. అనంతరం అవ్వాతాతల కల - జగనన్న కలలో వృద్ధులకు ఇంటింటికీ వెళ్లి చేపట్టిన పెన్షన్ల చెల్లింపును వివరిస్తారు. చివరిగా అక్కచెల్లెమ్మల కల - జగనన్న కలలో మహిళల కోసం చేపట్టిన పథకాలను వివరిస్తారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications