అగ్రిగోల్డ్: నిరసన, కేసులన్నీ సీఐడీకి బదిలీ(ఫోటోలు)
విశాఖపట్నం: విజయవాడలోని అగ్రిగోల్డ్ సంస్ధ ప్రధాన కార్యాలయం, యాజమాన్యం నివాసాల్లో వరుసగా రెండో రోజు (సోమవారం) పశ్చిమ గోదావరి జిల్లా పోలీసుల తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ సమాచారం తెలిసి పలు జిల్లాల్లో ఖాతాదారులు సంస్ధ కార్యాలయాల వద్దకు వచ్చి తమ డబ్బులు తమకు చెల్లించాలంటూ ఆందోళన చేశారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
అగ్రిగోల్డ్‌కి సంబంధించిన కేసులన్నింటినీ సీఐడీకి బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సీఐడీ చీఫ్ సీహెచ్. ద్వారకా తిరుమలరావు ఈ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎ.వి. రామారావు, ఆయన కుటుంబ సభ్యు నివాసాల్లో సోదాలు నిర్వహించారు.

అగ్రిగోల్డ్ కేసులన్నీ సీఐడీకి బదిలీ
విశాఖపట్నంలోని జగదాంబకూడలి వద్ద ఉన్న అగ్రిగోల్డ్ సంస్ధ కార్యాలయానికి ఖాతాదారులు ఎక్కువ సంఖ్యలో వచ్చి తీవ్ర నిరసనలు తెలిపారు.

అగ్రిగోల్డ్ కేసులన్నీ సీఐడీకి బదిలీ
విజయవాడలోని అగ్రిగోల్డ్ సంస్ధ ప్రధాన కార్యాలయం, యాజమాన్యం నివాసాల్లో వరుసగా రెండో రోజు (సోమవారం) పశ్చిమ గోదావరి జిల్లా పోలీసుల తనిఖీలు కొనసాగిస్తున్నారు.
అగ్రిగోల్డ్ కేసులన్నీ సీఐడీకి బదిలీ
ఈ సమాచారం తెలిసి పలు జిల్లాల్లో ఖాతాదారులు సంస్ధ కార్యాలయాల వద్దకు వచ్చి తమ డబ్బులు తమకు చెల్లించాలంటూ ఆందోళన చేశారు.

అగ్రిగోల్డ్ కేసులన్నీ సీఐడీకి బదిలీ
అగ్రిగోల్డ్‌కి సంబంధించిన కేసులన్నింటినీ సీఐడీకి బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సీఐడీ చీఫ్ సీహెచ్. ద్వారకా తిరుమలరావు ఈ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

అగ్రిగోల్డ్ కేసులన్నీ సీఐడీకి బదిలీ
సంస్ధ వద్ద ఉన్న నగదు నిల్వలు, స్ధిరాస్తులు, డిపాజిటర్ల వివరాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు.

అగ్రిగోల్డ్ కేసులన్నీ సీఐడీకి బదిలీ
ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల తనిఖీల చిత్రీకరణకు వెళ్లిన ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందిపై కొందరు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమపై దాడి చేసిన దుండగలను అరెస్టు చేయాలని జర్నలిస్ట్‌లు మాచవరం పోలీస్ స్టేషన్ ఎదుట నాలుగు గంటల పాటు ధర్నా చేశారు.

అగ్రిగోల్డ్ కేసులన్నీ సీఐడీకి బదిలీ
విజయనగరం జిల్లాలోని పార్వతీ పురం, బొబ్బిలి, శ్రీకాకుళం, కాశీబుగ్గలోని కార్యాలయాల వద్దకు పెద్దఎత్తున ఖాతాదారులు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.

అగ్రిగోల్డ్ కేసులన్నీ సీఐడీకి బదిలీ
కాగా, ఒడిశాలోని రాయగడలో అగ్రిగోల్డ్ కార్యాలయాన్ని పోలీసులు సోమవారం సీజ్ చేశారు.
సంస్ధ వద్ద ఉన్న నగదు నిల్వలు, స్ధిరాస్తులు, డిపాజిటర్ల వివరాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల తనిఖీల చిత్రీకరణకు వెళ్లిన ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందిపై కొందరు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమపై దాడి చేసిన దుండగలను అరెస్టు చేయాలని జర్నలిస్ట్‌లు మాచవరం పోలీస్ స్టేషన్ ఎదుట నాలుగు గంటల పాటు ధర్నా చేశారు.
ఇక విశాఖపట్నంలోని జగదాంబకూడలి వద్ద ఉన్న అగ్రిగోల్డ్ సంస్ధ కార్యాలయానికి ఖాతాదారులు ఎక్కువ సంఖ్యలో వచ్చి తీవ్ర నిరసనలు తెలిపారు. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు చెదరగొట్టారు. విజయనగరం జిల్లాలోని పార్వతీ పురం, బొబ్బిలి, శ్రీకాకుళం, కాశీబుగ్గలోని కార్యాలయాల వద్దకు పెద్దఎత్తున ఖాతాదారులు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, ఒడిశాలోని రాయగడలో అగ్రిగోల్డ్ కార్యాలయాన్ని పోలీసులు సోమవారం సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications