వ్యవసాయ బడ్జెట్ లో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, కొత్తగా ఇక..!!
ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్దికంగా తోడ్పాటు అందిస్తామని ప్రకటించింది. ప్రతీ రైతుకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, దాని ద్వారానే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వివరించారు. ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.53,752 కోట్లు గా మంత్రి ప్రతిపాదించారు. రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో 2026-27 ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ సాధారణ బడ్జెట్ ను ప్రతిపాదించిన తరువాత అచ్చెన్నాయుడు వ్యవసాయ - అనుంబంధ రంగాల కేటాయింపులను వివరించారు. అందులో భాగంగా ధాన్యం సేకరణకు సంబంధించి రూ.1,674 కోట్ల బకాయిలు చెల్లింపు చేసినట్లు వెల్లడించారు. పెట్టుబడి రాయితీ కింద రూ.310 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణలో 50 శాతం రాయితీతో రూ.136 కోట్లు, భూసారాన్ని అంచనా వేయడానికి 6 లక్షల భూసార పరీక్ష పత్రాల అందజేస్తున్నామని వివరించారు.

'పొలం పిలుస్తోంది' కార్యక్రమంతో 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందిస్తున్నారు. 80 శాతం రాయితీ కింద రూ.90.4 కోట్లతో 1,130 డ్రోన్ కేంద్రాలు, గతేడాది రూ.182 కోట్ల రాయితీతో విత్తనాల సరఫరా, పంటలను కాపాడేందుకు రైతులకు అన్నివిధాలుగా సాయం చేస్తామని ప్రకటించారు. సాగునీటి సౌకర్యాల కల్పనకు బిందు సేద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
రైతుల కోసం కొత్త నిర్ణయాలు అమలు
వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83 శాతం గా మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. PM కిసాన్ పథకం కింద రూ.6,309 కోట్లు చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు. 2026-27లో రూ.6,600 కోట్లు PM కిసాన్ కోసం కేటాయించగా.. ఇప్పుడు కొంత మేర పెంచారు. రాష్ట్ర ఆర్థిక రంగానికి మూల స్తంభంగా వ్యవసాయం నిలిచిందన్నారు. దేశ వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 10 శాతం గా చెప్పారు. 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించామని.. 24 గంటల్లో 9వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేసామని వివరించారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షం సాధ్యం అవుతుందని చెప్పారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రి టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా వ్యవసాయ రంగాన్ని గుర్తించామన్నారు. వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83 శాతం సాధించిందని తెలిపారు. పంటలను కాపాడేందుకు రైతులకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని తెలిపారు. 80 శాతం రాయితీతో రూ.90.4 కోట్లతో.. 1,130 డ్రోన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గతేడాది రూ.182 కోట్ల రాయితీతో విత్తనాల సరఫరా చేశామని మంత్రి పేర్కొన్నారు.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య..












Click it and Unblock the Notifications