చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు: రూట్, హాల్టింగ్ స్టేషన్లు, షెడ్యూల్..!!

రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓనం కు సొంత ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో, రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రైళ్ల వివరాలతో పాటుగా హాల్టింగ్ స్టేషన్లు.. రైళ్ల రాకపోకల షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు.

ఓనం వేళ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 16నుంచి 31వరకు ప్రతీ ఆదివారం చర్లపల్లి నుంచి ఉదయం 7.15గంటలకు 07197 ప్రత్యేక రైలు, ప్రతీ సోమవారం సాయంత్రం 4.45గంటలకు కొట్టాయం నుంచి ప్రత్యేక రైలు బయల్దేరుతాయని అధికారులు వివరించారు. ఈ రైళ్లు చర్లపల్లి స్టేషన్​లో బయల్దేరి విజయవాడ రూట్ లో కాకుండా.. నల్లగొండ, గుంటూరు మీదుగా ప్రయాణించనున్నాయి. ట్రైన్ నంబర్ : 07197 చర్లపల్లి - కొట్టాయం ప్రతి ఆదివారం (ఆగస్టు 16, 23, 30 తేదీల్లో) నడవనుంది. అదే విధంగా ట్రైన్ నంబర్ : 07198 కొట్టాయం - చర్లపల్లి ప్రతి సోమవారం (ఆగస్టు 17, 24, 31 తేదీల్లో) రాకపోకలు సాగిస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లకు రిజర్వేషన్ సౌకర్యం ప్రారంభించారు.

 విశాఖ నుంచి తిరుపతికి కొత్తగా మరో రైలు - రూట్, టైమింగ్స్..!!
విశాఖ నుంచి తిరుపతికి కొత్తగా మరో రైలు - రూట్, టైమింగ్స్..!!
railways-big-announcement-over-special-trains-during-onam-between-cherlapally-and-kottayam-details

రూట్.. హాల్టింగ్ స్టేషన్లు

అదే విధంగా చర్లపల్లి - కొట్టాయం రైలు ప్రతి ఆదివారం ఉదయం 7.25గంటలకు బయల్దేరు తుందని వివరించారు. తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం 12.25గంటలకు కొట్టాయం చేరేలా షెడ్యూల్ ఖరారు చేసారు. ఇక.. కొట్టాయం - చర్లపల్లి రైలు ప్రతి సోమవారం 4.45గంటలకు బయల్దేరుతుంది. తిరిగి రెండో రోజు అర్ధరాత్రి 12.30గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. కాగా. ఈ ప్రత్యేక రైళ్లను నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా ఏపీలోని గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట జంక్షన్ల మీదుగా ప్రయాణిస్తాయి. తమిళనాడులోని కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోదనూర్, పాలక్కాడ్ మీదుగా కేరళలోని త్రిసూర్, అలువ, ఎర్నాకుళం టౌన్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ప్రయాణీకులు ఈ ప్రత్యేక రైళ్ల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+