మోడీకి గుర్తు చేసిన బాబు! జగన్‌పైనా: ఆ మట్టితో ట్విన్ టవర్స్ (పిక్చర్స్)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏం ప్రకటిస్తారనే ఉత్కంఠ అందరిలోను ఉంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ అతిథిగా వస్తున్నారని, ఆయన ఏదో చేస్తారని ఆశించడం లేదని చెప్పారు. అదే సమయంలో కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. తద్వారా ప్రధానికి హామీని గుర్తు చేశారని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పిలిచినా రావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆత్మీయ అతిథి అని చెప్పారు. ఏపీ, తెలంగాణలు అన్నదమ్ముల్లాంటివారన్నారు.
కాగా, గురువారం ఉదయం పది గంటలకు అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమైంది. హీరో సాయికుమార్, గాయని సునీతలు వ్యాఖ్యానం చేస్తున్నారు. శంకుస్థాపనకు లక్షలాది మంది ప్రజలు, ప్రముఖులు తరలి వస్తున్నారు.

అమరావతి శంకుస్థాపన
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లన్నీ పూర్తి కావడంతో అధికారులంతా అతిథుల ఆహ్వానాలపై దృష్టి సారించారు. దేశ విదేశాలకు చెందిన అతిథులంతా వస్తుండటంతో గన్నవరం విమానాశ్రయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అతిథులకుస్వాగతం పలికేందుకు మంత్రులు, అధికారులు సిద్ధమయ్యారు.

అమరావతి శంకుస్థాపన
నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి శంకుస్థాపనకు సమయం ఆసన్నమైంది. అమరావతిని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

అమరావతి శంకుస్థాపన
శంకుస్థాపన మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు అన్ని జిల్లాల నుంచి అమరావతికి తరలివస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా పెద్దయెత్తున ప్రజలు అమరావతికి వెళ్లేందుకు ఉత్సాహం చూపించారు.

అమరావతి శంకుస్థాపన
ఏపీ జిల్లాల నుంచి అమరావతికి వేలాది బస్సులు, కార్లలో ప్రజలు తరలి వచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచి భారీగా తరలి వస్తున్నారు.

అమరావతి శంకుస్థాపన
అమరావతి సుముహూర్తం మధ్యాహ్నం 12.36 నుంచి 12.43 గంటల మధ్య ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.

అమరావతి శంకుస్థాపన
గౌతమ బుద్ధుడు నడయాడిన నేల, శాతవాహనులు, ఇక్ష్వాకులు తిరుగాడిన నేల... రేపటి తరాల ఆశల వారధిగా, తెలుగుజాతి ఘన చరితకు గుర్తుగా అమరావతి విరాజిల్లనుంది.

అమరావతి శంకుస్థాపన
ఇప్పుడు తెలుగు ప్రజల చూపంతా అమరావతివైపే ఉంది. రాష్ట్రంలోని దారులన్నీ ఆ భవిష్యత్తు రాచనగరి వైపే వెళ్తున్నాయి.

అమరావతి శంకుస్థాపన
అమరావతి... బౌద్ధారామంగా భాసిల్లి, ధాన్యకటకంగా విలసిల్లి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో స్థిరత్వాన్ని సాధించిన నేల మరోసారి తన కీర్తికిరీటాలను జిగేలుమనిపించనుంది.

అమరావతి శంకుస్థాపన
రాజధాని శంకుస్థాపన క్రతువులో భాగస్వాములయ్యేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆశేష జనవాహిని తరలి వస్తోంది. ఈ అరుదైన ఘట్టం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.

అమరావతి శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాకార్యం జరగనుంది. జపాన్, సింగపూర్ దేశాల మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామిక ప్రముఖులు తరలి వస్తున్నారు.

అమరావతి శంకుస్థాపన
గుంటూరు జిల్లా ఉద్ధండరాయనిపాలెం వద్ద పవిత్ర కృష్ణా నదీ తీరం ఈ మహాకార్యానికి వేదివుతోంది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి శంకుస్థాపన వేదిక వద్దకు చేరుకుంటారు.

అమరావతి శంకుస్థాపన
అమరావతి చరిత్రకు దర్పణం పట్టేలా, నవ్యాంధ్ర రాజధానికి కళ్లకు కట్టేలా ఏర్పాటు చేసిన అమరావతి పెవిలియన్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 12.36 నుంచి 12.43 గంటల మధ్య శంకుస్థాపన ముహూర్తం.

అమరావతి శంకుస్థాపన
అత్యంత ప్రముఖుల కోసం ప్రధాన వేదిక (ఎంఐపీ) అత్యంత ముఖ్యుల (వీవీఐపీలు) కోసం రెండు ఉప వేదికలు, ముఖ్యుల (వీఐపీ) కోసం రెండు గ్యాలరీలు ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై 15 మంది ఆశీనులవుతారు.

అమరావతి శంకుస్థాపన
ఉప వేదికలపై 700 మంది కూర్చుంటారు. వీఐపీ గ్యాలరీల్లో 8వేల మంది వరకూ కూర్చుంటారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజల కోసం 37 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమం చూసేందుకు ప్రాంగణం మొత్తం భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు.

అమరావతి శంకుస్థాపన
జపాన్ మంత్రి యొసుకె టకాగి, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు గవర్నర్లు నరసింహన్, రోశయ్య, వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు కార్యక్రమానికి హాజరవుతున్నారు.

అమరావతి శంకుస్థాపన
మొదట్లో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్, జపాన్ మంత్రులు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాత్రమే ప్రసంగించేలా షెడ్యూల్ రూపకల్పన జరిగింది. ముఖ్యమంత్రి పర్యవేక్షణదేశంలోని వివిధ పుణ్య నదులు, క్షేత్రాల నుంచి సమీకరించిన పవిత్రమైన మట్టి, జలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం హెలికాప్టర్ ద్వారా రాజధాని గ్రామాల్లో వెదజల్లారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ఈ కార్యక్రమం జరిగింది.

అమరావతి శంకుస్థాపన
దేశ, విదేశాల నుంచి సమీకరించిన మట్టి, నీటితో నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మణిమకుటంగా నిర్మించబోయే ట్విన్ టవర్స్ ముందు చారిత్రక స్మారకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

అమరావతి శంకుస్థాపన
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే హాజరవుతున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ వస్తున్నట్లు తొలుత అధికారిక సమాచారం పంపినా, చివరి నిమిషంలో పర్యటన రద్దుచేసుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. పంజాబ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆయన పర్యటన రద్దుచేసుకున్నట్లు రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు.

అమరావతి శంకుస్థాపన
కేసీఆర్‌కి స్వాగత, వీడ్కోలు బాధ్యతలను ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు అప్పగించారు. శంకుస్థాపన జరిగిన అనంతరం జరిగే సభలో కేసీఆర్‌కు మాట్లాడే అవకాశం కల్పించారు. తొలుత రూపొందించిన షెడ్యూల్‌లో ఇది లేకపోయినా తాజాగా ఈ అంశాన్ని చేర్చారు. ఈ మార్పునకు ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఆమోదముద్ర వేసింది.

అమరావతి శంకుస్థాపన
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామిని చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని 16వేల గ్రామాలు, దేశంలోని వివిధ పవిత్ర, స్వాతంత్ర సమరయోధుల జన్మ స్థలాల నుంచి మట్టి, నీరు సేకరించారు. ఇందులో కొంత భాగాన్ని బుధవారం రాజధాని ప్రాంతంలో సంప్రోక్షించారు.
మిగిలిన మట్టితో ట్విన్‌టవర్స్ ముందు స్మారకం నిర్మించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications