త్వరలో స్మార్ట్ ఫోన్లు మాయం.. ఆ స్థానంలో... !!
రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల్లోనే స్మార్ట్ ఫోన్లు మాయం కాబోతున్నాయా.. అంటే అవుననే అనవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడిదే ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా సీరియస్ గా నడుస్తున్న చర్చ. దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్.. ఇప్పుడు వీటిని AI పిన్ అని పిలుస్తున్నారు. దీనిపై అత్యంత వేగంగా పరిశోధనలు జరగటమే కాకుండా.. ట్రయిల్ రన్ కూడా బయటకు రావటం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఏఐ అనేది చాలా చిన్న పరికరం, మన చొక్కాలకు నేమ్ ప్లేట్ అంత సైజ్ లో ఉంటుంది. ఆ AI పిన్ ను మన చొక్కాకు పెట్టుకుంటే చాలు.. అందులోనే సెల్ ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ అన్నీ ఉంటాయి. ఫోన్ రింగ్ కాగానే మన చేతిపైనే కాకుండా గోడపైనా.. టేబుల్ పైనా.. ఎక్కడైనా సరే వర్చువల్ గా కనిపిస్తుంది.

గూగుల్, ఇతర మొబైల్ నెట్ వర్క్ కు కనెక్ట్ అయ్యి ఉండే ఈ AI పిన్ డివైజ్ ద్వారా ఎవరు కాల్ చేశారు.. నెంబర్ ఏంటీ అనేది చేతిపై డిస్ ప్లే లో కనిపిస్తుంది. మనకు ఏం కావాలన్నా సరే నోటితో చెబితే చాలు.. మాటల్లో సమాధానం ఇస్తుంది.డిస్ ప్లే గా కూడా చూపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మొబైల్ ఫోన్ ఎలా పని చేస్తుందో.. అచ్చం అలాగే ఈ AI పిన్ డివైజ్ పని చేస్తుంది.
ఆ చిన్న AI పిన్ లోనే శక్తివంతమైన కెమెరాతోపాటు వాయిస్ ఆధారంగా పని చేసే అన్ని ఆప్షన్స్ ఉండటంతో క్వాలిటీగా ఫోటోలు, వీడియోలు తీసి పెడుతుంది. యాపిల్ కంపెనీ డిజైనింగ్ లో స్టీవ్ జాబ్స్ తో కలిసి పని చేసిన ఇమ్రాన్ చౌదరి ప్రస్తుతం హుమానీ అనే స్టార్ట్అప్ కంపెనీ ద్వారా ఈ ప్రాడక్ట్ కోసం ఇప్పటికే 240 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసి ఐదేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు.
ఒక్కసారి మార్కెట్ లోకి వచ్చింది అంటే చాలు.. ఎగబడి కొనటానికి జనం సిద్దంగా ఉంటారు.. సో 2024నాటికి ఈ ఏఐ పిన్ డివైజ్ ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతుండటంతో, 2025 నాటికి స్మార్ట్ ఫోన్ అనేది మాయం కానుంది అంటూ పలువురు నెటిజన్లు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నారు.. ఇమ్రాన్ చౌదరి కలల డివైజ్ పరిశోధన ఎంత వరకు సక్సెస్ అవుతుందో అనే దానిపై ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications