భోగాపురం to బ్యాంకాక్.. ఇకపై వారానికి 2 సార్లు డైరెక్ట్ ఫ్లైట్.. బీచ్ లో ఫుల్ ఎంజాయ్..
బ్యాంకాక్ అనగానే చాలామంది ఎగిరి గంతేస్తారు. చాలా మందికి డ్రీమ్ టూరిస్ట్ స్పాట్స్ లో బ్యాంకాక్ తప్పకుండా ఉంటుంది. ఈ ఫారిన్ టూర్ లో ఒక్కసారైనా చిల్ అవ్వాలని కోరుకుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ థాయిలాండ్ లోని బ్యాంకాక్ టూర్ అంటే ఇష్టపడతారు. ఇక ముఖ్యంగా యూత్ కు అయితే ఇది ఫేవరెట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడికి వెళ్తే బ్యాంకాక్ బీచ్ లో ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. బ్యాంకాక్ లోని బీచ్ ల్లో రెచ్చిపోవాలని మీకూ ఉందా..?
అయితే తెలుగు రాష్ట్రాల పర్యటకులకు గుడ్ న్యూస్. వైజాగ్ నుంచి బ్యాంకాక్ కు ఇకపై వారానికి రెండు సార్లు డైరెక్ట్ ప్లైట్ సదుపాయం అందుబాటులోకి రానుంది. విశాఖపట్నంలోని భోగాపురంలో ఇటీవల ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నం టూ బ్యాంకాక్ విమాన సర్వీసులు ఈ మేరకు అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎయిర్ ఇండియా సంస్థ వారానికి రెండు సార్లు బ్యాంకాక్ కు ఈ సేవలను అందించనుంది. ఇటీవల ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ రూట్ కావడం విశేషం.
గత నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కేవలం 5 గంటల్లోనే వైజాగ్ నుంచి ప్రయాణికులను బ్యాంకాక్ కు చేర్చనుంది. స్టాప్స్ లేకుండా డైరెక్ట్ సర్వీసును అందించనుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లో టికెట్ ధర వైజాగ్ నుంచి బ్యాంకాక్ కు రూ. 14,643 గా ఉంది. అలాగే స్కూట్ లో వైజాగ్ నుంచి బ్యాంకాక్ కు టికెట్ ధర రూ. 12,546 గా ఉంది. ఒక్క స్టాప్ తో కలిపి 15 గంటల సమయం పట్టనుంది.

ఇక సింగపూర్ ఎయిర్ లైన్స్ అయితే ఏడు గంటల్లో వైజాగ్ నుంచి బ్యాంకాక్ కు చేరుకోనుంది. ఇందుకు ఒక టికెట్ ధర రూ. 21,022గా ఉంది. వన్ స్టార్ తో ఈ ప్రయాణ సౌకర్యాన్ని సింగపూర్ ఎయిర్ లైన్స్ అందించనుంది.












Click it and Unblock the Notifications
