ఆ జ్యూవెలర్స్ గుండూబాస్ ను ఫాలో అయిన సినీ నటుడు ఆలీ .. ఎలాగో తెలుసా ?

ఉదయం లేవగానే పేపర్ లో చూసినా, టీవీలో చూసిన డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ జూలరీ షాప్ యాడ్ లో గుండు బాస్ దర్శనమిస్తాడు. అసలు గుండుబాస్ చెప్పింది ఎవరికి ఏ మాత్రం అర్థం అయిందో తెలియదు కానీ హాస్య నటుడు అలీకి మాత్రం బాగా అర్థం అయినట్టుంది. అందుకే ఆలీ గుండు బాస్ ను తూచ తప్పకుండా ఫాలో అయ్యాడు.

ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏపీ లో రాజకీయాలు రసవత్తరంగా మారిన వేళ ఆలీ చేసిన పనితో బోలెడన్ని సెటైర్లు పేలుతున్నాయి.

Ali actor who is the follower of the Gundu Boss.. do you know how

అసలు ఇంతకీ కథేంటి అంటే ఈసారి ఎన్నికల్లో ఏపీ నుండి పోటీ చేయాలని భావించిన ఆలీ అన్ని పార్టీలు తిరిగారు. మొదటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ని కలిసిన ఆయన వైసీపీలో చేరుతారని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత ఆలీ మళ్ళి జనసేన అధినేత కళ్యాణ్ తో భేటీ అయ్యారు. అదే రోజున చంద్రబాబునాయుడ్ని కలిశారు. ఇలా అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఆయన ఫైనల్ గా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

దీంతో గుండు బాస్ ను ఆలీ ఫాలో అయ్యాడని సెటైర్లు పేలుతున్నాయి. టిడిపి, జనసేన, వైసీపీ మూడు పార్టీలకు వెళ్లి చూసి, ఫోటో తీసుకుని ఎస్టిమేట్లు పోల్చుకొని మరి వైసిపిలో చేరాడు ఆలీ. నటన ఎవరికి ఊరికే రాదు . అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

అన్ని పార్టీలు తిరిగి, ఒకటికి పదిసార్లు ఏ పార్టీతో ప్రయోజనం ఉంటుంది అనేది ఆలోచించి చివరికి వైసీపీలో చేరాడు సినీ నటుడు ఆలీ. గుండుబాస్ ఫార్ములా ఎవరు ఫాలో అయినా కాకున్నా ఆలి మాత్రం పక్కా గా ఫాలో అయినట్లున్నాడు అందుకే ఈ పార్టీ, ఆ పార్టీ అంటూ అన్ని పార్టీలను బేరీజు వేసి వైసీపీలో చేరాడు. ఆలీనా మజాకానా...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+