ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్- ఇవాళ నెగెటివ్ గా తేలిన అన్ని కరోనా శాంపిళ్లు..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఊరట కలిగించే వార్త చెప్పింది. ఇవాళ ల్యాబ్ లో పరీక్షలకు పంపిన అన్ని కరోనా వైరస్ శాంపిల్స్ నెగెటివ్ గా రావడంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారికి నిర్వహించిన పరీక్షల్లో 24 గంటల్లో 43 పాజిటివ్ కేసులు తేలడంతో ప్రభుత్వంలో ఆందోళన నెలకొంది. వీరి ప్రభావంతో ఇంకా ఎంత మందికి కరోనా సోకి ఉంటుందనే అంచనాతో మరింత అప్రమత్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఏపీలో ఇవాళ అన్ని శాంపిల్స్ నెగెటివ్..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంచనాలకు మించి విస్తరిస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ అందరికీ తాత్కాలికంగా ఊరట నిచ్చింది. ఇందులో ఇవాళ వివిధ జిల్లాల్లో ల్యాబ్స్ కు పంపిన 96 శాంపిల్స్ అన్నీ నెగెటివ్ గా వచ్చాయి. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో ఇది ప్రజలతో పాటు ప్రభుత్వానికీ, అధికారులకు పెద్ద ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం కేసుల సంఖ్య..
ప్రస్తుతం ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 87గా ఉంది. ఇందులో నిన్న ఉదయం వరకూ 44 మాత్రమే ఉండగా.. 24 గంటల్లో పరిస్ధితి ఒక్కసారిగా తారుమారైంది. నిన్న రాత్రి తర్వాత వెలువడిన పరీక్షా ఫలితాల్లో ఏకంగా 43 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు,అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది. అందులోనూ వీరంతా ఢిల్లీలోని మర్కజ్ లో ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారే కావడంతో ఆందోళన రెట్టింపైంది.
Recommended Video

ఇంకా తేలని బాధితులు..
ఇప్పటివరకూ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో 500 మందికి పైగా శాంపిల్స్ పరీక్షించగా.. వీరిలో 70 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కానీ మిగతా వారి జాడ ఎక్కడ ఉందన్నది పూర్తిగా తెలియరావడం లేదు. ఇప్పటికే ఢిల్లీ నుంచి లభించిన వివరాల ప్రకారం బాధితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న అధికారులు.. పలు జిల్లాల్లో ఇంటింటికీ వెళ్లి మరీ పరిశీలిస్తున్నారు. వీరి లెక్క తేలితే కానీ రాష్ట్రంలో కరోనా వైరస్ అసలు పరిస్ధితి తెలియదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications