ఈవీఎంలపై బాలినేని ఫిర్యాదు - నేడే "పరీక్ష", బిగ్ టర్న్..!!
ఒంగోలు కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బాలినేని ఎన్నికల ఫలితాల పై అనుమానాలు వ్యక్తం చేసారు. తమకు బలం ఉన్న ప్రాంతాల్లోనూ మెజార్టీ రాకపోవటం పైన సందేహాలతో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసారు. దీని పైన ఎన్నికల సంఘం స్పందించింది. ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేసారు.
నేడే పరీక్ష
ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంల్లో మాక్ పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 26 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 34,060 ఓట్లతో ఆయన వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలుపొందారు.

12 కేంద్రాల్లో
ఒంగోలు నియోజకవర్గంలోని పలు కేంద్రాల్లో పోలైన ఓట్లు...వచ్చిన మెజార్టీ పైన వైసీపీ అభ్యర్ది బాలినేని అనుమానంతో ఉన్నారు. పన్నెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహణ చేపట్టాలని బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆయన రూ.5.44 లక్షల నగదును ఎన్నికల సంఘానికి చెల్లించారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే కలెక్టర్ తమీమ్ అన్సారియా హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏం జరుగుతోంది
ఈ క్రమంలోనే మే 13 నాటి ఎన్నికల్లో వినియోగించిన 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాల్లో నేడు మాక్ పోలింగ్..రీ చెకింగ్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం బెల్ కంపెనీ ప్రతినిధులను కూడా వారు ఆహ్వానించనున్నారు. దీంతో, ఈ మాక్ పోలింగ్ నిర్వహణ..పరిశీలన సమయంలో ఎలాంటి అంశాలు గుర్తిస్తారు..ఏం జరుగుతుందనే ఉత్కంఠ రాజకీయంగా కనిపిస్తోంది. ఇదే తరహాలో మరి కొందరు నేతలు ఫిర్యాదులు చేయటంతో..ఇక్కడ వచ్చే ఫలితం కీలకం కానుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications