సీఆర్డీఏ రసాభాస: అధికారులపై రెచ్చిపోయిన వైసిపి ఎమ్మెల్యే
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో సీఆర్డీఏ నిర్వహించిన భూసేకరణ సదస్సు రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అధికారుల.
అమరావతి: గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో సీఆర్డీఏ నిర్వహించిన భూసేకరణ సదస్సు రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.
తాము చెప్పిందే రాసుకోవాలని వారితో వాగ్వాదానికి దిగారు. అందుకు అధికారులు తిరస్కరించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ఆళ్ల తన ముందు ఉన్న బల్లను తోసేశారు.

అనంతరం బల్లలను, కుర్చీలను విరగొట్టాలని తన అనుచరులకు ఎమ్మెల్యే ఆళ్ల సూచించారు. దీంతో రెచ్చిపోయిన అనుచరులు సదస్సులో కుర్చీలు, బల్లలను విరగ్గొట్టి సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications