మున్సిపల్ సీట్ల ఎఫెక్ట్, జెడ్పీ స్థానాలపై కొత్త ఫార్ములా- జనసేనకు దక్కే సీట్లు..!!

స్థానిక ఎన్నికల వేళ కూటమిలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల సీట్ల ఖరారు తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఈ సారి జెడ్పీ స్థానాల విషయంలో మూడు పార్టీల నేతలు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. పెద్ద సంఖ్యలో మూడు పార్టీల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా జెడ్పీ స్థానాల ఖరారులోనూ స్పష్టత వస్తోంది. జనసేన కు దక్కే సీట్లు దాదాపు ఖరారయ్యాయి.

మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల ఖరారు తరువాత జనసేన లో పార్టీ నాయకత్వం పైన కేడర్ లో ఆగ్రహం కనిపించింది. సోషల్ మీడియా వేదికగా తమ నిరసన వ్యక్తం చేసారు. పలు ప్రాంతాల్లో జనసేన నేతలు రెబల్స్ గా బరిలోకి దిగారు. దీంతో.. ఇప్పుడు జెడ్పీ ఎన్నికల సమయంలో గతం కంటే ఎక్కువ శాతం సీట్లు దక్కించుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా మొత్తం జెడ్పీ ఛైర్మన్ స్థానాల్లో 8-9 వరకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే, 5-6 వరకు జనసేనకు దక్కే అవకాశం ఉందని సమాచారం. అందులో ఇప్పటికే అల్లూరి సీతారామరాజు మణ్యం, అనకాపల్లి స్థానాలు జనసేనకు దాదాపు ఖరారయ్యాయి. మిగిలిన స్థానాల్లో జనసేన ప్రతిపాదనల పైన చర్చ సాగుతోంది. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, అనంతపురం, ప్రకాశం, తిరుపతి జెడ్పీ ఛైర్మన్లు తమకు కేటాయించాలని జనసేన కోరుతున్నట్లు తెలుస్తోంది.

జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పరిటాల శ్రీరామ్, చివరి నిమిషంలో..!!
జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పరిటాల శ్రీరామ్, చివరి నిమిషంలో..!!
alliance-leaders-leave-zptc-mptc-seat-sharing-decisions-to-local-leadership-here-the-details

జెడ్పీ స్థానాల పై తుది కసరత్తు

అయితే, జనసేనకు మొత్తంగా ఆరు దక్కుతాయని.. ఈ రోజు చర్చల తరువాత అధికారికంగా తేల్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బీజేపీకి ఒక్క జెడ్పీ స్థానం కేటాయించనున్నారు. ఇక.. కూటమి పార్టీల నేతల మధ్య జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన సీట్ల సర్దుబాటు అంశాన్ని ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వానికే అప్పగించాలని నిర్ణయించారు. జడ్పీ చైర్మన్‌ స్థానాల వరకు కూటమి పార్టీల రాష్ట్ర నాయకత్వం సర్దుబాటు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జడ్పీ చైర్మన్‌, 659 జడ్పీటీసీ స్థానాలు, 660 ఎంపీపీ, 9,829 ఎంపీటీసీ స్థానాలపై కూటమి పార్టీల నడుమ అవగాహన కుదరాల్సి ఉంది. సీఎం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తరువాత తుది నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది. జడ్పీటీసీలు, ఎంపీటీసీల సర్దుబాటు బాధ్యత స్థానిక జిల్లా నాయకత్వాలకు ముఖ్యంగా సమన్వయ కమిటీలకు అప్పగించా లని కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన అగ్రనేతలు నిర్ణయించారు. జడ్పీ చైర్మన్‌ స్థానాల వరకు రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించి మిగిలిన స్థానాల బాధ్యతను స్థానిక నాయకత్వానికి అప్పగించాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+