ఎంపీటీసీ సీటు వేలంపాట.. వైసీపీ అభ్యర్ధిని చెప్పుతో కొట్టిన మాజీ ఎమ్మెల్యే?

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కోరుకొండ మండలం బుచ్చంపేట ఎంపీటీసీ స్థానం వద్ద జరిగిన పరిణామాలు ఇప్పుడు అనేక రాజకీయ ప్రశ్నలను తెరపైకి తెస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ లేకుండా ఊరి ఆలయ అభివృద్ధి కోసం రూ.16.80 లక్షలకు ఎంపీటీసీ సీటును ఏకగ్రీవం చేసేలా బహిరంగ వేలంపాట జరిగిందనే ప్రచారం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణకు సిద్ధపడటం, ఆ తర్వాత జరిగిన హైడ్రామా నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ వేడిని రాజేసింది.

అర్ధరాత్రి రంగంలోకి జక్కంపూడి... అభ్యర్థిపై దాడి ఆరోపణలు!

తమ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి అనపర్తి మణికంఠ పోటీ నుంచి తప్పుకుంటున్నాడన్న సమాచారంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అర్ధరాత్రి తన అనుచరులతో కలిసి బుచ్చంపేటకు చేరుకున్నారు. ఊరి పెద్దల నిర్ణయం మేరకు ఏకగ్రీవానికి అంగీకరించానని అభ్యర్థి చెప్పడంతో, తమకు చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

ఈ క్రమంలో మణికంఠపై రాజా చేయి చేసుకున్నారని, ఆయన అనుచరులు చెప్పుతో కొట్టారని ఆరోపణలు రావడం, దీనిపై స్థానికులు ఎదురుతిరగడంతో తోపులాట జరిగి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత వీఆర్వో ఫిర్యాదుతో జక్కంపూడి రాజాతో పాటు మరో పదిమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Buchampeta MPTC Election Clash YCP Ex MLA Jakkampudi Raja s Entry Sparks Tension aces Assault Charges

పార్టీ లైన్ వర్సెస్ వేలంపాట రాజకీయం: వైఎస్సార్సీపీ కేడర్ వాదన!

ఈ వివాదంపై వైఎస్సార్సీపీ వర్గాల నుంచి భిన్నమైన వాదన వినిపిస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థల్లో ఎక్కడా ఏకగ్రీవాలకు తలొగ్గకుండా గట్టి పోటీ ఇవ్వాలనేది జక్కంపూడి రాజా శైలి అని ఆయన మద్దతుదారులు అంటున్నారు. రాజానగరం పరిధిలో పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉన్నప్పటికీ, ఎంపీటీసీ సీటును అధికార కూటమికి ఏకగ్రీవంగా వదిలేస్తే కేడర్ మనోధైర్యం దెబ్బతింటుందనే రాజా స్వయంగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. నామినేషన్ వెనక్కి తగ్గకుండా చూడాలనే తాపత్రయంతోనే ఆయన అక్కడకు వెళ్లారని, కానీ ఈ ఎపిసోడ్ దాడి కేసుల వరకు వెళ్లడం గమనార్హం.

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధులకు ఊరట-ఎస్ఈసీ కీలక ఆదేశాలు..!
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధులకు ఊరట-ఎస్ఈసీ కీలక ఆదేశాలు..!

ప్రతిపక్ష అభ్యర్థి వద్దకు కూటమి అగ్రనేతలు.. మానవత్వమా? రాజకీయ వ్యూహమా?

మరోవైపు ఈ ఘటన తెలియగానే జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బుచ్చంపేటకు చేరుకోవడం విశేషం. దెబ్బతిన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి మణికంఠను వారు పరామర్శించి, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. అయితే, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కోసం అధికార కూటమికి చెందిన అగ్రనేతలు నేరుగా క్యూ కట్టడం వెనుక కేవలం బాధితుడికి అండగా నిలబడటమే ఉందా? లేక ఏకగ్రీవ ఒప్పందం చేజారకుండా చూసుకునే వ్యూహం ఉందా? అనే చర్చలు స్థానికంగా మొదలయ్యాయి.

చిలకలూరిపేట ఎస్సైపై వేటు.. విడదల రజిని ఘటనపై ఎస్ఈసీ సీరియస్
చిలకలూరిపేట ఎస్సైపై వేటు.. విడదల రజిని ఘటనపై ఎస్ఈసీ సీరియస్

ప్రజాస్వామ్యమా.. ధన బలమా? రాజానగరంలో మిగిలిన ప్రశ్నలు!

ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వేలంపాటల పేరిట ఏకగ్రీవాలు ఖరారు చేసుకోవడం సరైనదేనా అనే ప్రశ్న సగటు ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఒకవైపు అధికార కూటమి బలాన్ని ప్రదర్శిస్తూ ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు ప్రతిపక్షంలో చలనం తీసుకురావడానికి రాజా లాంటి నేతలు ప్రయత్నించినా.. అది కాస్తా భౌతిక దాడులు, పోలీసు కేసులకు దారితీయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి బుచ్చంపేట రచ్చ రాజానగరం నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి రాజకీయ పోరుకు దారితీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+