ట్విస్ట్: బిజెపికి పవన్ ముద్దు: గులాబీకి సురేఖ ముల్లు
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో పొత్తుల అంశం ఉత్కంఠను రేపుతోంది. పొత్తు దాదాపు ఖాయమనుకున్న బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. టిడిపి పొత్తు కోసం చూస్తుండగా.. బిజెపి మాత్రం ఒంటరి పోరుకు సిద్ధమంటోంది. టిడిపి కూడా పైకి ఒంటరి పోరుకు సిద్ధమని చెబుతున్నప్పటికీ బిజెపి వైపు చూస్తోంది. అయితే, సీట్ల విషయంలో ఆ పార్టీల మధ్య పొత్తు పొడవటం కష్టంగా మారుతోంది.
బిజెపి.. ముఖ్యంగా తెలంగాణ బిజెపి క్యాడర్ టిడిపితో పొత్తుకు విముఖత చూపుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చినప్పటికీ ఆయన తీరు విభజనకు వ్యతిరేకంగా కనిపించిందని తెలంగాణ ప్రజలు బలంగా నమ్ముతున్నారని, ఇలాంటి పరిస్థితిల్లో ఆ పార్టీతో పొత్తు అంటే బిజెపికి నష్టమే అంటున్నారు. ఒంటరిగా వెళ్తేనే ఎక్కువ సీట్లు, ఓట్లు దక్కించుకోవచ్చునని అధిష్టానానికి చెబుతున్నారు.

అవసరమైతే 2019 నాటికి పార్టీని తెలంగాణలో బలోపేతం చేసి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేయవచ్చునని చెబుతున్నారు. అదే టిడిపితో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ప్రజలలో బిజెపి పట్ల వ్యతిరేకత ఏర్పడుతుందని, అది లోకసభ ఓటింగ్ నమోదు పైన కూడా పడే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేంత సీన్ లేకపోయినప్పటికీ 2019 నాటికి పార్టీ ఆ దిశగా దూసుకెళ్తుందంటున్నారు. అయితే, టిటిడిపి నేతలు మాత్రం బిజెపితో పొత్తుకు మొగ్గు చూపుతున్నారు.
ఇక, సీమాంధ్ర ప్రాంతంలోను బిజెపి ఒంటరిగా వెళ్లేందుకే ఇప్పుడు ఆసక్తి చూపిస్తోంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం, నాగార్జున మోడీని కలిసిన అనంతరం సీమాంధ్ర బిజెపిలో ఊపి మరింత పెరిగిందంటున్నారు. తాము కోరినన్ని సీట్లు ఇవ్వని పక్షంలో ఒంటరిగా వెళ్తాంటున్నారు. పార్టీలోకి భారీగా చేరికలు, నాగార్జున, పవన్ మద్దతుతో పార్టీ సీమాంధ్రలో మరింత పుంజుకుందని, ఇవి ఓట్ల రూపంలోకి మారటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కెసిఆర్‌కు కోదండ షాక్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ షాకిచ్చారు. కొండా సురేఖ, మహేందర్ రెడ్డి వంటి వారిని తెరాస తమ పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఆయన తప్పు పడుతున్నారు. వారు తెలంగాణ ద్రోహులు అని, అలాంటి వాళ్లను పార్టీలో చేర్చుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రానున్న ఎన్నికల్లో తాము ఎవరికి మద్దతిస్తామనే విషయాన్ని త్వరలో చెబుతామని చెప్పడం గమనార్హం. సురేఖ, మహేందర్ రెడ్డిల పైన జెఏసి వ్యాఖ్యలను టి కాంగ్రెసు కూడా తమకు అనుకూలంగా వినియోగించుకుంటోంది. జెఏసి ప్రశ్నలకు తెరాస సమాధానం చెప్పుకోలేకపోతోందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
ఇక.. మజ్లిస్ పార్టీ సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణలో కాంగ్రెసు పార్టీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెసు, సిపిఐల మధ్య పొత్తు పొడుస్తోంది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒంటరి పోరుకు దాదాపు సిద్ధమవుతోంది. అయితే, సిపిఎం మాత్రం జగన్ పార్టీ నుండి సంకేతం వస్తే తాము స్పందిస్తామని చెబుతున్నారు.
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications