అల్లుడు గారొచ్చారు- నాగబాబు మెగా హ్యాపీ

Allu Arjun: ఐకన్ స్టార్ అల్లు అర్జున్.. అనూహ్య నిర్ణయాలను తీసుకుంటోన్నారు. జైలు నుంచి విడుదలైన తరువాత ఆయన ఆలోచన ధోరణి పూర్తిగా మారిపోయినట్టే కనిపిస్తోంది. అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరించే దిశగా అడుగులు వేస్తోన్నారు. ఈ క్రమంలో మెగా కుటుంబంతో ఉన్న బాంధవ్యాలను పునరుద్ధరించుకుంటోన్నారు.

ఈ క్రమంలో- ఆ మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్. కారును సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ మేనమామ ఇంటికి వెళ్లారు. భార్య స్నేహారెడ్డితో మెగా కాంపౌండ్‌లో గ్రాండ్‌గా అడుగు పెట్టారు. చాలాకాలం తరువాత ఇంటికి వచ్చిన తన మేనల్లుడిని చిరంజీవి, ఆయన భార్య సురేఖ సాదరంగా ఆహ్వానించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

Allu Arjun meets Nabagabu at his residence

ఆ సమయంలో అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి దంపతులకు నమస్కరించారు. ఎట్టకేలకు అల్లు అర్జున్.. మెగాస్టార్ ఇంటి గడప తొక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మెగా కాంపౌండ్‌తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో చాలాకాలం పాటు ఆయన చిరంజీవి కుటుంబానికి దూరంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడు తాజాగా నాగబాబు ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్. కొద్దిసేపటి కిందటే ఆయనను కలుసుకున్నారు. అల్లు అర్జున్‌ దంపతులకు ఎదురొచ్చి మరీ స్వాగతం పలికారు నాగబాబు, ఆయన భార్య పద్మజ. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పుష్ప 2- ది రూల్ సూపర్ హిట్ అయినందుకు అభినందించారు.

రికార్డు స్థాయిలో ఆరు రోజుల్లోనే 1,000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను వసూలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నాగబాబు ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో- ఏపీ మంత్రివర్గంలో బెర్త్ కన్‌ఫర్మ్ అయినందుకు నాగబాబును కూడా అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పారని తెలుస్తోంది. కంగ్రాచ్యులేషన్స్ మామయ్యా అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారని సమాచారం.

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన తరువాత మెగాస్టార్ ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయనకు బెయిల్ లభించింది. 50 వేల రూపాయల పూచీకత్తుపై నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అల్లు అర్జున్‌- మెగా కుటుంబం మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేనను కాదని తన ఆప్త మిత్రుడైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు పలికడాన్ని మెగా కుటుంబం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది అప్పట్లో.

స్వయంగా పవన్ కల్యాణే కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగినప్పటికీ- సొంత కుటుంబ సభ్యుడై ఉండీ అల్లు అర్జున్ అక్కడికి ప్రచారానికి గానీ, పలకరింపుగా గానీ వెళ్లలేదు. అదే సమయంలో రామ్ చరణ్ పిఠాపురానికి వెళ్లడం అల్లు అర్జున్‌తో ఆంతర్యాన్ని మరింత పెంచింది. నాగబాబు పలుమార్లు అల్లు అర్జున్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు పెట్టడం తెలిసిన విషయమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+