అల్లు అర్జున్ ఫ్యాన్సా.. మజాకా

Allu Arjun: ఏపీలో ఎన్నికల ఘట్టం ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం అందరి దృష్టీ ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీపై నిలిచింది. ఈ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.

ఈ ఎన్నికల్లో అల్లు అర్జున్.. ఒక వైపు- మిగిలిన మెగా కుటుంబం అంతా మరోవైపు నిలిచాయి. తనకు అత్యంత ఆప్తుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డి కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. మిత్రుడి కోసం నంద్యాలకు వచ్చి మరీ ప్రచారం చేశారు.

Allu Arjun row Naga Babu deactivated his official X account

పిఠాపురం నుంచి స్వయానా తన మేనమామ పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ- ఆయన కోసం అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లలేదు. ఓ ట్వీట్ పోస్ట్ పెట్టి వదిలేశారు. అదే సమయంలో రామ్ చరణ్, తన తల్లి సురేఖతో కలిసి ప్రచారం చివరి రోజున పిఠాపురం వెళ్లారు. కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు.

ఈ పరిణామం మెగా కుటుంబంలో తీవ్ర చర్చనీయాంశమైంది. మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కల్యాణ్‌కు ఓటు వేయాలంటూ పిలుపునివ్వడం, సాయి ధరం తేజ్ వంటి మెగా కాంపౌండ్ హీరోలు పవన్ కల్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారానికి వెళ్లిన పరిస్థితుల్లో వారిని కాదని అల్లు అర్జున్.. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోసం ప్రచారానికి వెళ్లడం ఆ కుటుంబంలో కలకలం రేపింది.

దీనితో అల్లు అర్జున్‌ను దూరం పెట్టాలని నిర్ణయించుకుంది మెగా ఫ్యామిలీ. పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ దీనికి నిదర్శనం. తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు తమ వాడైన పరాయివాడేనని నాగబాబు ట్వీట్ పెట్టారు.

తమతో నిలబడేవాడు పరాయివాడైన తమ వాడేనంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మ గురించి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వర్మ.. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కోసం పని చేసిన విషయాన్ని నాగబాబు గుర్తు చేశారు. తెలిసి చేశారో.. తెలియక చేశారో గానీ ఈ ట్వీట్- నాగబాబును విమర్శలకు కేంద్రబిందువుగా మార్చింది.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కుప్పలు తెప్పలుగా నాగబాబుకు రిప్లైలు పెట్టారు. ఘాటు పదజాలంతో రెచ్చిపోయారు. బూతు పదాలను సైతం ప్రయోగించారు. వందల సంఖ్యలో రిప్లైలు పడ్డాయి ఈ ట్వీట్‌కు. అల్లు అర్జున్ ఆర్మీ మాత్రమే కాకుండా అటు వైఎస్ఆర్సీపీ కంట్లో కూడా పడ్డారు నాగబాబు.

Allu Arjun row Naga Babu deactivated his official X account

ఓ ఫ్లడ్‌లా రిప్లైలు వస్తోండటంతో తన ఎక్స్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకున్నారు నాగబాబు. @nagababuoffl అనే ఎక్స్ హ్యాండిల్‌ను చాలాకాలం పాటు మెయింటెయిన్ చేశారు నాగబాబు. వేల సంఖ్యలో దీనికి ఫాలోవర్స్ ఉన్నారు.

జనసేనకు సంబంధించిన అధికారక సమాచారం మొత్తాన్నీ ఇందులో పోస్ట్ చేేసేవారు. తన అభిప్రాయాలను సైతం దీని ద్వారం పంచుకునేవారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పిస్తుండేవారు ఈ అకౌంట్ నుంచే. ఇప్పుడది డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చూపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+