జగన్ మద్దతుకు అల్లు అర్జున్ థాంక్స్ - ట్వీట్ వైరల్..!!
మాజీ సీఎం జగన్ కు ప్రముఖ హీరో అల్లు అర్జున్ థాంక్స్ చెప్పారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేసారు. తన సంతాప సందేశంలో అల్లు కుటుంబ సభ్యులను ప్రస్తావించారు. ప్రత్యేకంగా అల్లు అర్జున్ ను ట్యాగ్ చేసారు. ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్ కు అల్లు అర్జున్ స్పందించారు. థాంక్స్ చెబుతూ బన్నీ ట్వీట్ చేసారు.
అల్లు అర్జున్ నానన్న అల్లు కనకరత్నమ్మ మృతి పైన పలువురు ప్రముఖులు స్పందించారు. అల్లు కుటుంబానికి సంతాపం తెలిపారు. కనకరత్నమ్మ మృతి విషయం తెలిసిన వెంటనే చిరంజీవితో సహా మెగా కుటుంబ సభ్యులు అల్లు అరవింద్ నివాసానికి వెళ్లారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. చిరంజీవి అక్కడే ఉన్నారు. తన అత్తగారి కళ్లను చిరంజీవి ఐ బ్యాంకు డొనేట్ చేసారు. ఇక..పలువురు సినీ ప్రముఖులు సైతం అల్లు అరవింద్ ను పరామర్శించి.. కనకరత్నమ్మ మృతి పట్ల సంతాపం తెలిపారు. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్స్ ఖాతా ద్వారా తన సంతాపం ప్రకటించారు.

జగన్ తన ట్వీట్ లో ''దివంగత నటులు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మృతి చెందడం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి'' అని పేర్కొన్నారు. జగన్ తన సంతాప సందేశంలో ప్రత్యేకంగా అల్లు అర్జున్ ను ట్యాగ్ చేసారు.

ఇక, జగన్ ట్వీట్ పైన అల్లు అర్జున్ స్పందించారు. థ్యాంక్యూ జగన్ గారు! మీ మంచి మాటలు, సపోర్ట్ కి మేము నిజంగా కృతజ్ఞులం.. అంటూ బన్నీ ట్వీట్ చేసారు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ల పైన కామెంట్స్ రూపంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications