పవన్ కోసం అమరావతికి అల్లు అర్జున్ - "మెగా" డైరెక్షన్..!!
మెగా ఫ్యామిలీ వార్ ప్రచారానికి ఇక ముగింపు పడనుంది. అల్లు అర్జున్ అరెస్ట్ ..తరువాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సమయం నుంచి అల్లు అర్జున్ తో మెగా ఫ్యామిలీ కి గ్యాప్ ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. పుష్ఫ -2 విడుదల సమయంలోనూ సోషల్ మీడియా వేదికగా ఇదే రకంగా చర్చ సాగింది. అల్లు అర్జున్ అరెస్ట్ వేళ మెగా బ్రదర్స్ అండగా నిలిచారు. హైదరాబాద్ వచ్చిన పవన్ మాత్రం అల్లు అర్జున్ ను కలవలేదు. చిరంజీవి, నాగబాబు ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. ఇప్పుడు చిరంజీవి సూచనతో పవన్ వద్దకు అల్లు అర్జున్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ నిర్ణయంతో
అరెస్ట్ పరిణామం తరువాత అల్లు అర్జున్ ఎపిసోడ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటు న్నాయి. పుష్ఫ - 2 విడుదల సమయంలో టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వటం పైన ఏపీ ప్రభుత్వానికి ..ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్ ధన్యవాదాలు చెప్పారు. కానీ, ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లటం జనసేన శ్రేణులకు.. పవన్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. అప్పటి నుంచి ఒక రకంగా కోల్డ్ వార్ కొనసాగుతోంది. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ వేళ చిరంజీవి, నాగబాబు స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారు.

మెగా బ్రదర్స్ తో భేటీతో
కానీ, శనివారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన పవన్ కల్యాణ్ సైతం అల్లు అర్జున్ ను పరామర్శి స్తారనే వార్తలు వచ్చాయి. కానీ, పవన్ పరామర్శ లేకుండానే తిరిగి అమరావతికి వెళ్లిపోయారు. తన అరెస్ట్ తో తన ఇంటికి వచ్చి అండగా నిలిచిన మామ చిరంజీవి, నాగబాబు ఇంటికి సతీ సమేతంగా వెళ్లిన అల్లు అర్జున్ వెళ్లారు. అక్కడ చిరంజీవితో సంధ్యా థియేటర్ తొక్కిసలాట.. తాజా పరిణామా ల పైన చర్చించారు. ఇదే సమయంలో పవన్ ను కలవాలని చిరంజీవి సూచించినట్లు ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. అందుకు వెంటనే అల్లు అర్జున్ సైతం వెళ్తానని చెప్పినట్లు సమాచారం. ఇక, నాగబాబుతో భేటీ ద్వారా కొంత కాలంగా ఉన్న గ్యాప్ కు ముగింపు పలికినట్లేనని భావిస్తున్నారు.
పవన్ తో భేటీ కోసం
అరెస్ట్..జైలు నుంచి విడుదల అయి వచ్చిన తరువాత అల్లు అర్జున్ కు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి అనూహ్య మద్దతు దక్కింది. పలువురు సినీ ప్రముఖులు వచ్చి పరామర్శించారు. అదే విధంగా అరెస్ట్ సమయంలో వైసీపీ, బీఆర్ఎస్, బీజేపీ మద్దతుగా నిలిచాయి. ఇక, ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ తో భేటీకి కూడా ఇదే సరైన సమయం గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని పరామర్శించి.. ఆ తరువాత అమరావతికి తానే వెళ్లి పవన్ ను కలవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే రెండు రోజుల్లోనే అల్లు అర్జున్ అమరావతికి వెళ్లటం.. లేదా, పవన్ హైదరాబాద్ వస్తే కలిసేలా సిద్దం అవుతున్నట్లు మెగా కాంపౌండ్ లో చర్చ జరుగుతోంది. దీంతో, పవన్ - అల్లు అర్జున్ భేటీ పైన సినీ - పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications