ఆళ్ల రామకృష్ణా రెడ్డికి సీఐడీ నోటీసులు: వైఎస్ జగన్‌కి ఇవ్వాలంటూ హర్షకుమార్ డిమాండ్, లేదంటే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో మంగళగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే)కి బుధవారం సీఐడీ నోటీసులు జారీ చేసింది. రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీకి ఆర్కే ఫిర్యాదు చేయడంతో అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

హాజరుకావాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు
ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీఐడీ ఈ నోటీసులు ఇచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అమరావతి భూములకు సంబంధించిన సమాచారం చెప్పాలంటూ రామకృష్ణారెడ్డిని నోటీసులో కోరింది. ఉన్న సమాచారాన్ని సీఐడీకి సమర్పించాలని ఎమ్మెల్యేకు స్పష్టం చేసింది.

మార్చి 23న సీఐడీ ముందుకు చంద్రబాబు?
ఇప్పటికే అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 22న నారాయణ, మార్చి 23న చంద్రబాబు నాయుడు హాజరుకావాలని సీఆర్పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీలో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు నాయుడు సీఐడీ ముందు హాజరవుతారా? లేదా? అని ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది.

సీఎం వైఎస్ జగన్‌కూ సీఐడీ నోటీసులివ్వాలంటున్న హర్షకుమార్
ఇది ఇలావుండగా, అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబునాయుడుకు ఇచ్చినట్లే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా సీఐడీ నోటీసులు ఇవ్వాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట దళితుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల్ని దళితుల నుంచి లాక్కున్న వివరానలు సీఐడీ డీజీ సునీల్ కుమార్ కు అందజేస్తామన్నారు. దళితులకు ఇందిరాగాంధీ, రాజీవ్, ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇచ్చిన భూముల్ని జగన్ లాక్కున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు హర్షకుమార్.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications