రాజధాని అమరావతి ఐకానిక్ టవర్ల నిర్మాణంపై లేటెస్ట్ అప్డేట్!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినన్నాటి నుండి రాజధాని అమరావతి నిర్మాణంపై ఫుల్ గా ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు ప్రపంచం మొత్తం దృష్టి సారించేలా రాజధాని అమరావతి నిర్మాణం చెయ్యాలని సంకల్పించి ఆ దిశగా పనులు యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.

ఐకానిక్ టవర్ల నిర్మాణంలో తొలి డయాగ్రిడ్ పూర్తయిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ప్రతి రెండు నెలలకు ఆరు అంతస్తుల నిర్మాణం పూర్తవుతోందని ఆయన తెలిపారు. మంత్రి నారాయణ అమరావతిలో సమీక్ష నిర్వహించి సీఆర్డీఏ, ఏడీసీఎల్ ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఐకానిక్ అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఫౌండేషన్ పనులు దాదాపు పూర్తయ్యాయని, అధికారులు, ప్రజాప్రతినిధుల భవనాలు కూడా సిద్ధమవుతున్నాయని చెప్పారు.

అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు.. రూ.599 కోట్ల రైల్వేలైన్‌కు టెండర్లు!
అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు.. రూ.599 కోట్ల రైల్వేలైన్‌కు టెండర్లు!
Amaravati Capital Works Update First Diagrid of Iconic Towers Completed Capital Completion by Oct 2028

నవంబర్ 11 తర్వాత నుంచి సిద్ధమైన భవనాల ప్రారంభోత్సవాలు చేస్తామని కూడా మంత్రి నారాయణ ప్రకటించారు. గత నెలలో కురిసిన వర్షాల కారణంగా పనులకు కొంత అంతరాయం కలిగిందని, ప్రస్తుతం వర్షాకాలం ముగియడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి అన్నారు. 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్ల నిర్మాణం జరుగుతోందని, రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

ప్రస్తుతం సుమారు 35 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారి సంఖ్యను మరింత పెంచాలని కాంట్రాక్టర్లను ఆదేశించామన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన ప్రకారం 2028 అక్టోబర్ నాటికి అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం మూడు గ్రామాల్లో భూసమీకరణ చాలా వరకు పూర్తయిందన్నారు.

 అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ పక్క నుంచే హైస్పీడ్‌ రైలు రూట్, రెండింటికీ కలిపే..!!
అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ పక్క నుంచే హైస్పీడ్‌ రైలు రూట్, రెండింటికీ కలిపే..!!

వచ్చే నెలాఖరుకు 75 శాతానికి పైగా పూర్తవుతుందని చెప్పారు. రోడ్ నెట్‌వర్క్ అభివృద్ధికి సింగపూర్ సంస్థ డిసెంబర్ నాటికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయనుందని కూడా తెలిపారు. అయితే రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్లు కాలమ్స్, బీమ్స్ లేకుండా కోర్ వాల్, త్రిభుజాకార డయాగ్రిడ్ సాంకేతికతతో నిర్మిస్తున్నారు. ఇవి రాజధానికి తలమానికంగా నిలవనున్నాయి. పనులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని మంత్రి నారాయణ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+