వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఒత్తిడి తేవొద్దు-జీతాలు రాకుంటే సర్కార్ దే బాధ్యత-బొప్పరాజు కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా విభిన్న చర్చలు, వాదనలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఉద్యోగులు పీఆర్సీపై సమ్మెకు సిద్ధమవుతున్న తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇవాళ ప్రభుత్వ నిర్ణయంపై సంచలన కామెంట్స్ చేశారు.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు ఉద్యోగులంతా ఉద్యమంలో ఉండగా ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని తెర మీదకు తెచ్చిందని, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను చేపట్టాల్సిన ఉద్యోగులంతా ఉద్యమంలోనే ఉన్నారన్నారు. ఐఏఎస్ అధికారులు మినహా ఉద్యోగలందరూ సమ్మెకు సిద్దమవుతున్నారని, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కోసం ఉద్యోగులుగా చేయగలిగినంత వరకు చేస్తామన్నారు. తమపై అధికారులు ఒత్తిడి తేవద్దన్నారు ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి ఘర్షణ వాతావరణం తీసుకు రావద్దన్నారు.

amaravati jac leader bopparaju venkateswarlu warns govt on new districts amid employees strike

Recommended Video

Andhra Pradesh : Complete List Of 13 New Districts In AP | Oneindia Telugu

మరోవైపు ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో ఈ నెల జీతాలపై ఉత్కంఠ నెలకొంది. సకాలంలో పేరోల్స్ అప్ లోడ్ కాకుండా జీతాలు సకాలంలో రావడం కూడా కష్షమే. దీనిపై స్పందించిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఛైర్మన్ బొప్పరాజు ప్రభుత్వం జీతాలు రాకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు రాకుంటే నేతలపై ఉద్యోగులు తిరగబడతారని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఉద్యోగులకు జీతాలు రాకుంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలని బొప్పరాజు హెచ్చరించారు. దీంతో ఇప్పుడు బొప్పరాజు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

English summary
ap employees leader bopparaju venkateswarlu on today made sensational comments on formation of new districts amid employees strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X