అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రం పై అమరావతి జేఏసీ అసంతృప్తి : ప్రధాని - షా తో సమావేశం : సీఎం జగన్ పై ఒత్తిడి పెంచేలా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

అమరావతి రాజధాని వ్యవహారంలో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని.. రాజధాని మార్పు అధికారం పైన హైకోర్టు స్పష్టత ఇచ్చింది. దీంతో..అమరావతి రాజధానిగా కొనసాగుతుందనే నమ్మకం స్థానిక రైతుల్లో ఏర్పడింది. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం తమ విధానం మూడు రాజధానులే అంటూ చెప్పుకొస్తోంది. కానీ, హైకోర్టు తీర్పు పైన అప్పీల్ కు వెళ్లలేదు. సీఆర్డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందాలను మాత్రం పూర్తి చేసి..వారికి ప్లాట్లను ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇటు అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు మరోసారి ప్రవేశపెడతారనే ప్రచారం సాగుతున్నా..దాని పైనా స్పష్టత లేదు. దీంతో...రాజధానుల వ్యవహారం ఎన్నికల అజెండాగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఢిల్లీ పర్యటనతో మరింత క్లారిటీ

ఢిల్లీ పర్యటనతో మరింత క్లారిటీ

ఇదే సమయంలో అమావతి జేఏసీ నేతలు నేరుగా కేంద్రం పెద్దలను కలిసి ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి నిధులు.. అదే విధంగా కేంద్ర కార్యాలయాల నిర్మాణం సైతం చేపట్టకపోవటాన్ని వారు తప్పు బడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి పరిధిలో 24 కేంద్రప్రభుత్వ సంస్థలకు 208 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 27 ఎకరాల్ని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం రూ. 4 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొన్నింటికి ఉచితంగా మరికొన్నింటికి తక్కువ ధరకు గత ప్రభుత్వం భూములు కేటాయించింది. ఒకటి రెండు సంస్థలు మినహా మిగిలిన సంస్థలేవి అక్కడ నిర్మాణాలు ప్రారంభించలేదు. రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారాలన్నీ అమరావతి నుంచే సాగుతున్నాయి.

కేంద్ర నిర్మాణాలు పూర్తి చేయాలంటూ

కేంద్ర నిర్మాణాలు పూర్తి చేయాలంటూ

అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు చేపట్టకపోవటంపై స్థానికుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీంతో..ఢిల్లీ వెళ్లి కేంద్రంలోని ముఖ్యులను కలవాలని నిర్ణయించారు. తాజాగా, హైకోర్టు తీర్పుతో రాజధాని పైన స్పష్టత వచ్చిందని.. ఇప్పటికైనా నిర్మాణాలు ప్రారంభించాలని అమరావతి జేఏసీ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ దృష్టికి రాజధాని రైతులు ఈ విషయాల్ని తీసుకెళ్లారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవాలని నిర్ణయించారు. వచ్చే నెల మూడో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు జేఏసీ ఢిల్లీ పర్యటన ఖరారైంది. కేంద్ర మంత్రులతో వారు భేటీ కానున్నారు. అదే విధంగా ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ సమావేశం అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

అంతు చిక్కని జగన్ వ్యూహం

అంతు చిక్కని జగన్ వ్యూహం

దీని ద్వారా హైకోర్టు తీర్పుతో ఒక విధంగా సందిగ్దంలో పడినట్లుగా ప్రభుత్వం కనిపిస్తోందని ..ఇదే సమయంలో కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకురాగలిగితే అమరావతిలో నిర్మాణాలు ప్రారంభం అవుతాయని జేఏసీ నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో అమరావతిలో అసంపూర్తిగా నిర్మాణాలు జరిగిన ఐఏఎస్ అధికారుల క్వార్టర్లను పూర్తి చేసేలా సీఆర్డీఏ అధికారులు కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ముందుగా తక్కువ బడ్జెట్ తో పూర్తయ్యే నిర్మాణాల పైన ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక.. ఈ నెల 25వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తి కానున్నాయి. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల వ్యవహారం పైన ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

English summary
Amaravati JAC leaders decided to Meet Union Ministers on Amaravati issue, to build pressure on AP Govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X