పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్, ముహూర్తం ఫిక్స్..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చి రెండేళ్ల కాలం పూర్తి అవుతు న్న వేళ.. కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. జూన్ 12వ తేదీన కూటమి ప్రభుత్వం మూడో ఏట అడుగు పెడుతోంది. ఈ క్రమంలో కొత్త పెన్షన్ల మంజూరు పైన ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు అధికారికంగా స్పష్టత ఇచ్చింది. కొత్త పెన్షన్ల దరఖాస్తులు .. అర్హతలు.. మంజూరు ముహూర్తం పైన కీలక ప్రకటన చేసింది.
ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరు పైన ప్రకటన వచ్చింది. అర్హులైన వితంతువులకు మరియు ఇతర సామాజిక పింఛన్ల లబ్ధిదారులకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, రాబోయే జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు. అర్హత ఉండి, వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు పింఛన్లు రాని లబ్ధిదారులు త్వరలోనే ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షలతో, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అనేకమంది పేదల పింఛన్లను అన్యాయంగా తొలగించారని, ఆ సమస్యలన్నింటినీ తమ ప్రభుత్వం సరిచేస్తుందని స్పష్టం చేశారు.

మూడో అడుగు పెడుతున్న వేళ కొత్త పెన్షన్ల మంజూరు
కాగా.. కేవలం వితంతువులకే కాకుండా.. వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ బాధితులు, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకు న్న వారు, ద్వైపాక్షిక బోదకాలు, కుష్టు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అర్హులైన పేదలను ఈ కొత్త పెన్షన్ల పరిధిలోకి తీసుకొచ్చారు. తాజాగా ప్రభుత్వం 895 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. దీంతో ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.86.34 లక్షల అదనపు భారం పడుతుందని మంత్రి వివరించారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వితంతువుల పింఛన్ల కింద 1.53 లక్షల మంది వరకూ అర్హులుం ఉండే అవకాశం ఉందని సెర్ప్ అంచనా వేస్తోంది. నెలకు రూ.4వేల చొప్పున లక్షా 53 వేల మందికి వితంతు పింఛన్లు అందించేందుకు సుమారుగా రూ.61 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతినెలా సుమారు 64 లక్షల సామాజిక భద్రతా పెన్షన్ల కోసం రూ 2,700 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. నెక్స్ట్ జరిగే కేబినెట్ భేటీలో కొత్త పెన్షన్ల మంజూరు పైన అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు.













Click it and Unblock the Notifications