amaravati railway line: అమరావతి రైల్వే లైన్ నిర్మాణంలో కేంద్రం కీలక అడుగు!

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నిజంగానే రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ప్రపంచమంతా గుర్తించేలా తీర్చి దిద్దాలని భావిస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా తమ సమావేశాల్లో అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే అమరావతి మీదుగా రైల్వేలైన్ ప్రకటించిన కేంద్రం అమరావతి ప్రగతికి రైల్వే ద్వారా పనుల వేగాన్ని పెంచింది.

రైల్వే లైన్ కోసం భూసేకరణ
ప్రస్తుతం అమరావతికి వెళ్లే రైలు మార్గాన్ని రూపొందించేందుకు భారతీయ రైల్వే సంస్థ వేగంగా కృషి చేస్తోంది. రాజధాని అమరావతికి వెళ్లే కొత్త రైలు మార్గాన్ని నిర్మించేందుకు కొంత భూమిని తీసుకోనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య ప్రాంతాలలో రైలు మార్గానికి అవసరమైన భూమిని సేకరించాలని కార్యాచరణ మొదలు పెట్టింది.

amaravati railway line works in jet speed land aquisition started in guntur district

భూసేకరణ నోటిఫికేషన్ తో పనులు వేగం
ఈ మేరకు ఎర్రుపా లెం - అమరావతి - నంబూర్ రైల్వే లైన్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. గుంటూరు జిల్లాలోని 97 గ్రామాలలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వటంతో భూసేకరణలో వేగం పుంజుకోనుంది. కొత్త రైల్వే ట్రాక్ నిర్మించేందుకు తెలంగాణ ప్రాంతంలోనూ భూసేకరణ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో సహాయం చేయడానికి, ఖమ్మం జిల్లా నుండి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను పర్యవేక్షించడానికి నియమించారు.

ఎర్రుపాలెం నుండి అమరావతి మీదుగా నంబూరుకు రైల్వే ట్రాక్
ఖమ్మం జిల్లాలోని రెండు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ నిర్మాణం, సంరక్షణ బాధ్యతలను ప్రత్యేక అధికారి నిర్వహిస్తారు.ఈ రైల్వే ట్రాక్ 56.53 కిలోమీటర్ల పొడవు ఉంటుంది . ఎర్రుపాలెం నుండి అమరావతి మీదుగా నంబూరును కలుపుతుంది. దీని వలన ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లోని రాజధాని నగరమైన అమరావతికి సులభంగా ప్రయాణించవచ్చు.

రైల్వే లైన్ భూసేకరణకు దాదాపు 2600 కోట్ల రూపాయలు
గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఖమ్మం వంటి కొన్ని ప్రాంతాల్లో కొత్త రైలు మార్గాన్ని నిర్మించేందుకు దాదాపు 450 హెక్టార్ల భూమిని వినియోగించుకోనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించటం కోసం దాదాపు 2600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని రైల్వే భావిస్తుంది. ఈ కొత్త రైల్వే లైన్ లో మొత్తం తొమ్మిది స్టేషన్లు ఉండనున్నాయి.

అమరావతి రైల్వే లైన్ నిర్మాణంలో వేగంగా అడుగులు
పెద్దాపురం, చిన్నరావులపాలెం, గొట్టిముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావురు స్టేషన్లు ఈ రైల్వే లైన్ లో ఉంటాయి. వీటిలో అమరావతిని ప్రధాన స్టేషన్‌గా అభివృద్ధి చేయటానికి రైల్వే నిర్ణయం తీసుకుంది. 2029 నాటికి అమరావతి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నందున, వచ్చే మూడేళ్లలో అమరావతికి రైల్వే ట్రాక్ పూర్తి చేసేందుకు రైలు శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత రాజధాని అమరావతికి కనెక్ట్ అయ్యేలా రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో భూసేకరణనోటిఫికేషన్ తో కీలక అడుగు పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+