మావిగన్ పై స్పందన చూసి చంద్రబాబుకు వణుకుపుడుతోంది!
ఏపీలో రాజధాని అమరావతిపైన, జగన్ ప్రతిపాదించిన మావిగన్ పైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా రగడ కొనసాగుతుంది. ఈ క్రమంలో తాజాగా అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయడం సాధ్యం కాని పని అని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి పేర్కొన్నారు.
మావిగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అవుతుంది: రాచమల్లు శివప్రసాద రెడ్డి
ఆచరణ సాధ్యం కాని అమరావతి కన్నా మావిగన్ సులువైన అభివృద్ధి మంత్రం అన్నారు. రూ.20 వేల కోట్లతో వేగంగా పూర్తి చేయొచ్చన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ తో కూడిన మావిగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అవుతుందన్నారు. మావిగన్ పై ప్రజల్లో వచ్చిన స్పందన చూసి చంద్రబాబులో వణుకుపుడుతోందని, అందుకే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మావిగన్‌పై సోషల్ మీడియాలో పెయిడ్ ట్రోలింగ్
చంద్రబాబు రూ. కోట్లు ఖర్చు చేసి మావిగన్‌పై సోషల్ మీడియాలో పెయిడ్ ట్రోలింగ్ చేయిస్తున్నాడని రాచమల్లు శివప్రసాద రెడ్డి మండిపడ్డారు . మావిగన్ పేరుతో నీచాతి నీచంగా వైయస్ జగన్ పై వ్యక్తిగత దాడి చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. మావిగన్ పై చంద్రబాబు కుట్ర రాజకీయాలు వర్కవుట్ కాకపోవడంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారన్నారు.
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ .. బరిలోకి ఆ మీడియా అధిపతి
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా శిఖండి లాంటి ఒక మీడియా అధిపతిని బరిలోకి దింపాడని మండిపడ్డారు. జర్నలిజం ముసుగులో ఆ మీడియా అధిపతి బ్రోకరిజం మొదలుపెట్టాడని విమర్శలు చేశారు. ఆయన వీకెండ్ స్టోరీలో వైయస్సార్సీపీ నాయకులను అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా చిత్రీకరించాడని ఇది మంచిది కాదని అన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఆ మీడియా అధిపతి కొవ్వెక్కి మాట్లాడుతున్నాడని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మావిగన్ పై జగన్ ప్రతిపాదన
జగన్ చెప్పిన మావిగన్ ప్లాన్ లో తప్పేమీ లేదని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాము అమరావతికి వ్యతిరేకం కాదన్న జగన్.. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలను కలిపి రాజధాని చేసి.. 'మావిగన్' అని పేరు పెట్టాలని సూచించారు. రాష్ట్రం కోసం ప్రాక్టికల్‌గా ఆలోచించే ఎవరికైనా తాము చెప్పేది అర్థమవుతుందన్నారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications