బీజేపీపై తేల్చేసిన మంత్రి అమర్నాథ్, ఏపీ సాఫ్టువేర్ సంస్థలపై షాకింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖ: వైసిపి అధినేత జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ, తదనంతర పరిణామాల నేపథ్యంలో టిడిపి - బిజెపిల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో బిజెపి - టిడిపి పొత్తుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయమై మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పందించారు.

బీజేపీతో మిత్రత్వం విషయంలో ఎలాంటి అపోహలు వద్దని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో పాలక ప్రభుత్వంపై పోరాడుతున్నది ఒక్క టిడిపి మాత్రమే అన్నారు. ఆయన ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ క్రీడా మైదానంలో మహానాడు ఏర్పాట్లు పరిశీలించారు.

చంద్రబాబుకు షాకిచ్చిన సీనియర్ నేత

ఈ సందర్భంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉందని, పార్టీ శ్రేణుల ద్వారా విషయాలు తెలుసుకొని ప్రజలకు మంచి చేయడానికి మహానాడు ఒక వేదిక అని అమర్నాథ్ రెడ్డి అన్నారు.

Amarnath Reddy clarifies on alliance with BJP

అంతకుముందు అమర్నాథ్ రెడ్డి ఏపీలోని సాఫ్టువేర్ కంపెనీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలతో స్థానిక నోవాటెల్ హోటల్లో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలోని సాఫ్టువేర్ కంపెనీలకు పెద్ద ప్రాజెక్టులు చేయగలిగే సత్తా లేదని, చేయగలమని నిరూపించుకుంటేనే ప్రభుత్వానికి సంబంధించిన సాఫ్టువేర్ సర్వీసులు ఇక్కడి వారికి కేటాయిస్తామన్నారు.

అనంతరం సీఐఐ విశాఖ చాప్టర్ చైర్మన్ తిరుపతి రాజు, స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధి సురేష్ కుమార్ మాట్లాడారు. నక్కపల్లి, అచ్యుతాపురం ఎస్ఈజెడ్ లలోని పరిశ్రమలను మంత్రి పరిశీలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Amarnath Reddy clarified on alliance with Bharatiya Janata Party.
Please Wait while comments are loading...